బిగ్ బాస్ ఫైనల్ గెస్ట్ గా వెంకటేష్..!

-

బిగ్ బాస్ సీజన్ 2 ఫైనల్ గెస్ట్ గా ఎన్.టి.ఆర్ వస్తున్నాడన్న వార్తలొచ్చాయి. మొదటి సీజన్ హోస్ట్ కాబట్టి ఎన్.టి.ఆర్ సెకండ్ సీజన్ ఫైనల్ కు వచ్చేందుకు అంగీకరించి ఉంటాడని అనుకున్నారు. కాని బిగ్ బాస్ టీం నుండి వచ్చిన ఎక్స్ క్లూజివ్ న్యూస్ ప్రకారం చూస్తే ఫైనల్ గెస్ట్ గా వచ్చేది ఎన్.టి.ఆర్ కాదు విక్టరీ వెంకటేష్ అని తెలుస్తుంది.

హోస్ట్ నాని కాబట్టి నాని ఉంటాడు కాని ఈసారి ఫైనల్స్ కు గెస్ట్ గా విక్టరీ వెంకటేష్ ను పిలుస్తున్నారట. వెంకటేష్ కూడా అందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఇక ఈరోజు బిగ్ బాస్ హౌజ్ లో ఆల్రెడీ ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యులంతా వచ్చి ఫైనల్ రేసులో ఉన్న ఐదుగురిని విష్ చేశారు. ఓ విధంగా బిగ్ బాస్ మొదటి రోజు ఉన్న 16 మంది కంటెస్టంట్స్ ఈరోజు ఉన్నారన్నమాట.

మొత్తానికి బిగ్ బాస్ ప్రేక్షకులను మెప్పిస్తూ మనసులను గెలిచేస్తున్నాడు. ఇక టైటిల్ విన్నర్ ఎవరన్నది మాత్రం ఆదివారం తెలుస్తుంది. ఆరోజు 6 గంటల నుండి బిగ్ బాస్ ప్రసారం కానుంది. దాదాపు 3 గంటల దాకా షో రన్ అవుతుందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version