కార్న్ ఫ్లేక్స్ బిజినెస్ తో ఇలా లాభాలు పొందండి..!

-

మీరు ఏదైనా బిజినెస్ ని స్టార్ట్ చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం ఈ బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ చేస్తే తప్పక రోజుకు రూ.4000-5000 వరకు సంపాదించవచ్చు. అంటే నెలకి లక్షల్లోనే. ఇక ఈ బిజినెస్ ఐడియా గురించి పూర్తి వివరాలలోకి వెళితే.. కార్న్ ఫ్లేక్స్ బిజినెస్ చేసి మంచిగా రాబడి పొందొచ్చు. ఉదయాన్నే కార్న్ ఫ్లేక్స్ ని అల్పాహారం కింద చాలా మంది తింటారు. ఆరోగ్యంపై దృష్టి పెట్టే వారు ఖచ్చితంగా మీ ఉత్పత్తిని కొనుగోలు చేస్తారు.

అయితే ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి భూమి అవసరం. అలాగే మీ వస్తువులను నిల్వ చేయడానికి ఒక స్థలం కావాలి. కనీసం 2000 నుండి 3000 చదరపు అడుగుల విస్తీర్ణం అవసరం. అలానే విద్యుత్ కనెక్షన్, GST నంబర్ , దాని కోసం ముడిసరుకు కలిగి ఉండాలి. ప్రారంభ పెట్టుబడి విషయానికొస్తే, ఈ పని రూ. 6-7 లక్షలతో ప్రారంభమవుతుంది. దీని తయారీ కోసం చూస్తే.. 1 కిలో మొక్కజొన్న ఫ్లేక్స్ చేయాలంటే సుమారు 30 రూపాయలు అవసరం అవుతాయి. రూ.65-70 చొప్పున అమ్మొచ్చు.

మొక్క జొన్న నుండి తయారు చేసిన మొక్కజొన్న ఫ్లేక్స్ ని ప్రత్యేక యంత్రం తో తయారు చేస్తారు, అదే యంత్రంతో గోధుమ , బియ్యం ఫ్లేక్స్ ను కూడా తయారు చేయవచ్చు. మొక్కజొన్న, గోధుములు కనుక కొనుగోలు చేస్తే ఖచ్చితంగా మంచి క్వాలీటీవి అయ్యి ఉండేలా చూసుకోండి. లేదా ప్రోడక్ట్ క్వాలిటీ తగ్గిపోతుంది. కాబట్టి నాణ్యతని దృష్టిలో పెట్టుకుని వ్యాపారం చేయండి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version