వాస్తు: మీ పిల్లలు చదువులో రాణించట్లేదా? స్టడీ రూంలో ఈ తప్పులే కారణం కావచ్చు

-

వాస్తు శాస్రం అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుందని చాలా మంది నమ్ముతారు. కట్టుకునే ఇల్లు దగ్గర నుండి ఇంట్లో ఉండే ప్రతీ వస్తువు ఏ దిక్కులో ఉండాలి? ఎక్కడ ఉంచితే అది ఎలాంటి ప్రభావం చూపుతుంది? మొదలగు విషయాలన్నీ లెక్కలోకి వస్తాయి. అందుకే ఈ విషయాల్లో చాలామంది జాగ్రత్తగా ఉంటారు. ప్రస్తుతం పిల్లల చదువు విషయంలో వాస్తు శాస్త్ర రీత్యా ఎలాంటి పొరపాట్లు చేస్తున్నారో తెలుసుకుని, వాటికి వాస్తు శాస్త్రంలో ఎలాంటి విరుగుడు ఉందో తెలుసుకుందాం.

పిల్లలు చదువులో వీక్ గా ఉంటున్నారని మీకనిపిస్తే, స్కూల్ మార్పించడమో, లేదా ట్యూషన్ పెట్టించడమో చేస్తుంటారు చాలామంది. అయినా కూడా వారి చదువులో ఎలాంటి మార్పు రానట్టయితే, దోషం ఇంట్లోనే ఉందని గుర్తించాలి. అది వారి స్టడీ రూమ్ లో ఉండవచ్చు. స్టడీ రూం లోని రంగులు పిల్లల చదువుపై ప్రభావం చూపిస్తాయని తెలుసుకోండి. అవును, వాస్తు శాస్త్రం ప్రకారం చదువుకునే గదిలో రంగులు ఏవి ఉండాలనేది ఇప్పుడు తెలుసుకోండి.

మనసు మీద ప్రభావం చూపకుండా చదువు మీద లగ్నం చేసేలా ఉండేందుకు లేత రంగులు సాయపడతాయి. ముదురు రంగులు కాకుండా లేత రంగులైన క్రీమ్ కలర్, లేత ఆకుపచ్చ, లేత నీలం ఇలా అన్నీ లేత రంగులతో గోడలకు పెయింట్ వెయ్యాలి. అప్పుడు స్టడీ రూంలో చదువుకున్నా మనసు మీద ఎలాంటి దుష్ప్రభావం ఉండదు. ఈ వాస్తు శాస్త్ర సూచన చాలా బాగా పనిచేస్తుందని నమ్మకం. మీ పిల్లలు చదువులో వీక్ గా ఉన్నట్లు మీకు అనిపిస్తే ఒక్కసారి ఈ లేత రంగు చిట్కా అమలు పరచండి.

Read more RELATED
Recommended to you

Latest news