Chiranjeevi Vs Mohan Babu: మునుపు ఎన్నాడు లేనివిధంగా ఎంతో ఉత్కంఠగా జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్( మా) ఎన్నికల్లో మంచు విష్ణు గెలిచి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ మేరకు శనివారం ఉదయం ‘మా’ నూతన అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సమయంలో విష్ణుతో పాటు ఆయన ప్యానెల్ నుంచి గెలుపొందిన 15 సభ్యులూ ప్రమాణస్వీకారం చేసి పదవి బాధ్యతలు స్వీకరించారు. దీంతో, ‘మా’లో నూతన కార్యవర్గం కొలువుదీరింది.
పదవి స్వీకారొత్సవానికి ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ వేదికైంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా రానున్నారు. అలాగే, పలువురు టాలీవుడ్ ప్రముఖులు
హాజరు అయ్యారు.
ఇదిలా ఉంటే.. మంచు విష్ణు ప్రమాణ స్వీకరానికి ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు హాజరు కాలేదు. అలాగే మెగా క్యాంపు నుంచి కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎవరూ హాజరు కాలేదు. చిరంజీవిని ఆహ్వానించలేదనే ప్రచారం సాగుతోంది. అందుకనే మెగా ఫ్యామిలీ ఈ కార్యక్రమానికి దూరంగా ఉందని తెలుస్తుంది.
బాలకృష్ణ, కోటా శ్రీనివాసరావు, కైకాల సత్యనారాయణ తదితరుల ఇంటికెళ్లి మంచు ఫ్యామిలీ స్వయంగా ఆహ్వానించింది. ఇక మిగతా మా సభ్యులకు మోహన్ బాబు ఫోన్ చేసి ఆహ్వానించారట. మరికొందరికి మెస్సేజ్ రూపంలో ఇన్విటేషన్ పంపారట. ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న మెగా ఫ్యామిలీని ఆహ్వానించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవికి మెస్సేజ్ రూపంలో ఇన్విటేషన్ పంపారని మరికొందరూ అంటారు.
అలాగే.. ఎన్నికల అనంతరం మంచు విష్ణు మెగాస్టార్ పై ఆరోపణలు చేశారు. చిరంజీవి అంకుల్ తనను ఎన్నికల నుండి తప్పొకోమన్నారని, చరణ్ కూడా నాకు ఓటు వేసి ఉండడు.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో ప్రకాశ్ రాజ్ తో సహా తన ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులు రాజీనామాలు చేశారు. ఆ తరుణంలో మోహన్ బాబు, మంచు విష్ణు, నరేష్ లపై ఘాటు విమర్శలు చేశారు. వారి ఆరోపణలు, విమర్శలు, వారి రాజీనామాల వెనుక మెగా ఫ్యామిలీ ఉందని భావించే.. మోహన్ బాబు కుటుంబం చిరంజీవికి ఆహ్వానం పంపలేదని అంటున్నారు మరికొందరూ.
అదే సమయంలో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, నాగబాబులను కూడా ఉద్దేశ పూర్వకంగా ఆహ్వానించలేదని,
తమ అభిమాన హీరోలను అవమానించాలనే దురుద్దేశంతోనే మంచు ఫ్యామిలీ కుట్రపూరితంగా వ్యవహరించిందని మెగా అభిమానులు ఆరోపిస్తున్నారు. అందరిని కలుపుకొని పోవాలని, పెద్దలంటే ఎంతో గౌరవ మర్యాద ఇవ్వాలని సుద్దలు చేపే పెదరాయుడు.. బాలకృష్ణ, కోటా శ్రీనివాసరావు, కైకాల సత్యనారాయణ తదితరులను ఆహ్వానించడానికి ఉన్న సమయం, మెగా హీరోలను పలకరించడానికి లేదా? అని మరి కొందరూ విమర్శిస్తున్నారు.
ప్రధానంగా ప్రకాశ్‌రాజ్ ప్యానల్ కు మద్దతు ఇచ్చినందుకే మెగా ఫ్యామిలీని దూరం పెట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు కొలువుదీరిన వేడుక నుంచే పెదరాయుడు తన ప్రసంగంతో సంకేతాలు పంపినట్టు తెలుస్తుంది.
మోహన్ బాబు తన ప్రసంగంలో.. పగ, ద్వేషాలు లేవు. నా పగ నాకే నష్టం ఉన్నట్లు మాట్లాడితే తప్పు బడతారు. నువ్వు గొప్పా..నేను గొప్పా అనేది ముఖ్యం కాదు. అంత మంది ఉన్నాం.. ఇంత మంది ఉన్నాం.. మా సినిమాలే ఆడతాయి.. అని ఎంతో మంది బెదిరించారు.. కానీ ఎక్కడా భయపడలేదు. వారు మంచు విష్ణును గెలిపించుకున్నారని మోహన్ బాబు అన్నారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే మోహన్ బాబు మెగా ఫ్యామిలీ మీద విమర్శలు చేసినట్టు కనిపిస్తోంది.
ఇదే సమయంలో వారం రోజుల కిత్రం .. చిరంజీవి మాటలకు పరోక్షంగా స్పందించారు. ఇది చిన్న ఉద్యోమని అన్నారు.. ఏ మీకు తెలియదా? ఇది ఎంత పెద్ద బాధ్యత అని అంటూ మోహన్ బాబు చురకలు అంటించాడు. ఇండస్ట్రీలో ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదని, ప్రతిభ, క్రమశిక్షణ ఉంటే అవకాశాలు వస్తాయని మోహన్ బాబు అన్నాడు. మంచు విష్ణు ప్యానెల్ మెంబర్లు, వారికి సపోర్ట్ చేసిన వారికి మెగా హీరోల సినిమాల్లో అవకాశాలు ఇవ్వబోరంటూ వస్తోన్న రూమర్లపై మోహన్ బాబు అలా పరోక్షంగా స్పందించినట్టు కనిపిస్తోంది.
ఏది ఏమైనా.. మంచు ఫ్యామిలీ అన్ని గొడవలు పక్కన పెట్టి.. చిరంజీవిని గౌరవప్రదంగా ఆహ్వానం పంపి ఉంటే.. ఇగోలు, గొడవలకు పుల్ స్టాప్ పడుతుండేదని ఇండస్ట్రీ పెద్దలు భావిస్తున్నారు.