ఫోటో మార్ఫింగ్ చేశారంటూ మండిపడుతున్న మాస్టర్ బ్యూటీ..!

-

  1. అందాల ముద్దుగుమ్మ మాళవిక మోహన్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మాళవిక మోహన్ దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన పట్టం పోలే అనే మలయాళ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది. ఇలా మలయాళ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన మాళవికా మోహనన్ ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీపై ఇంట్రెస్ట్ చూపింది.

అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కిన మాస్టర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు మాళవిక మోహన్ నటనకు, అందచందాలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇది ఇలా ఉంటే మాళవిక మోహన్ నేరుగా తెలుగు సినిమాలు చేయకపోయినప్పటికి మాస్టర్ సినిమా ద్వారా టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

ఇది ఇలా ఉంటే మాళవిక మోహన్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్ లను నిర్వహించి తన హాట్ హాట్ స్కిన్ షో కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తు ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా తన ఒరిజినల్ ఫోటోగ్రాఫ్ ను ఎవరో ఫోటోషాప్ చేసి అసభ్యకరమైన ఫోటోను రూపొందించారని ఆరోపించింది మాళవిక . తన అసభ్యకరమైన ఫోటోను చాలా మంది వ్యక్తులు మరియు ప్రముఖ మీడియా సంస్థలు సహా ప్రచారం చేస్తున్నారు అని మాళవిక మోహన్ చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version