మలేషియా తెలంగాణా అసోసియేషన్ (MYTA) ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకి మలేషియా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఉన్న తెలంగాణా ప్రజలు అందరూ హాజరయ్యారు. తమ సంస్కృతీ, సాంప్రదాయంలో భాగంగా, తెలంగాణాలో తమకి అతిపెద్ద పండుగ అయిన బతుకమ్మ ని వైభవంగా జరుపుకున్నారు.
మలేషియా కౌలాలంపూర్ లో బాంకేట్ హాల్, బ్రిక్ ఫీల్డ్స్ లో ఏర్పాటు చేసిన బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులతో మహిళలు, పురుషులు చిన్నా పెద్దా తేడా లేకుండా భారీగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎంతో ఆకర్షణీయమైన పూలతో కన్నుల పండుగగా ఈ పండుగని నిర్వహించారు మైట సభ్యులు. ఈ పండుగకి ముఖ్య అతిదిగా మలేషియాలోని సెలన్గోర్ట్ స్టేట్ మినిస్టర్ గనిపతి రావు హాజరయ్యారు.
అంతేకాదు మలేషియా తెలుగు సంఘం ప్రెసిడెంట్ డా . అచ్చియ్య కుమార్ కూడా ఈ వేడుకలకి హాజరయ్యారు. మలేషియా తెలుగు పునాది ప్రెసిడెంట్ , ఇండియన్ హై కమిషనర్ లేవర్ వింగ్ సెక్రటరీ, లాగే పిరమిడ్ సొసైటీ ప్రెసిడెంట్ వంటి ప్రముఖుకులు పాల్గొన్నారు. బతుకమ్మ పాటలతో, కళాకారులతో, ఆటలతో ఈ కార్యక్రమం ఎంతో కన్నుల పండుగలా జరిగింది. ముఖ్యంగా తెలంగాణా వంటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.