ఆర్‌బీఐ షాకింగ్ డెసిష‌న్‌: ఏటీఎంల్లో రూ.2 వేల నోటు బంద్‌

-

ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత రూ.2 వేల కరెన్సీ నోటును అందుబాటులోకి తెచ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కి చెందిన ఏటీఎంల నుంచి ఇకపై రూ. 2,000 నోటు రాదు. క్రమేపి వాటి సంఖ్యను తగ్గిస్తామని వెల్లడించింది. అంతేకాక ఆర్బీఐ ఆదేశాల మేరకు ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రూ. 2 వేల నోట్లను ఉంచే క్యాసెట్లను దాదాపు అన్ని ఏటీఎంల నుంచి తొలగించింది.

మున్ముందు రూ.500 నోటును కూడా ఆపేసి.. కేవలం రూ.100, రూ. 200 నోట్లతోనే ఏటీఎం లావాదేవీలు జరిగేలా చూసేందుకు ఎస్‌బీఐ యోచిస్తోంది. కాగా చిన్ననోట్లు మాత్రమే లభ్యం కానుండటంతో వినియోగదారుల సౌకర్యార్థం ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితిని పెంచే దిశగా బ్యాంకు సన్నాహాలు చేస్తోంది. మెట్రో నగరాల్లో 10 సార్లు.. ఇతర ప్రాంతాల్లో 12 సార్లు ఉచితంగా ఏటీఎం నుంచి నగదు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version