డైలీ వేడి నీటితో స్నానం చేసే పురుషులకు సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుందట..

-

వేడినీటితో స్నానం చేస్తే..ఫ్రష్‌ ఫీల్‌ అనిపిస్తుంది. రోజంతా బయట కష్టపడి వచ్చి.. అలా వేడి వేడి నీళ్లతో స్నానం చేసి వచ్చామంటే హాయిగా అనిపిస్తుంది. ఆ ఒత్తిడి, బాడీపెయిన్స్‌ అన్నీ తగ్గి రిలాక్స్‌ అవుతారు. పైగా ఇది చలికాలం..చన్నీళ్లతో స్నానం చేస్తే ఇంకేమైనా ఉందా..అందరూ హాట్‌ వాటర్‌నే ప్రిఫర్‌ చేస్తారు… అయితే వేడి నీటి స్నానం అన్ని విధాలుగా మంచిది కాదనేది ఆరోగ్య నిపుణుల వాదన.. పైగా మగవారు డైలీ వేడి నీటితో స్నానం చేస్తే అసలుకే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు. వేడినీళ్ల ఉష్ణోగ్రత పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. మీరు విన్నది నిజమే..

వేడినీళ్లు స్పెర్మ్ నాణ్యతపై ప్రతికూల ప్రభావాలను ప్రేరేపిస్తుందని వైద్యులు వెల్లడించారు. వేడి వాతావరణంలో నివసించే లేదా పని చేసే మగవారు తమ పునరుత్పత్తి సామర్థ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే శరీర ఉష్ణోగ్రత కంటే వృషణాల ఉష్ణోగ్రత రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా ఉంటుంది. అలా తక్కువగానే ఉండాలి. అధిక ఉష్ణోగ్రత వాతావరణంలో ఉండడం, అనారోగ్యకరమైన జీవనశైలి వృషణాలలోని స్మెర్మ్‌ను దెబ్బతీస్తుంది. తరుచూ వేడి నీటి స్నానం చేయడం వల్ల స్పెర్మ్‌ నాణ్యత తగ్గుతుంది. కాబట్టి ఆ భాగంలో ఎక్కువ ఉష్ణోగ్రత తగలకుండా చూసుకోవాలి. మందపాటి దుస్తులు కూడా ఉష్ణోగ్రతను పెంచేస్తాయి. జంక్ ఫుడ్, వాతావరణ మార్పులు కూడా శరీర ఉష్ణోగ్రతను పెరిగేలా చేసి స్పెర్మ్ నాణ్యతను దెబ్బతీస్తాయట… వెల్డింగ్ పని, బాణా సంచా, సిమెంట్ ఫ్యాక్టరీలలో పనిచేసేవారిలో తీవ్ర ఉష్ణోగ్రతలు తగిలే అవకాశం ఉంది. వాళ్ల ఇంకా జాగ్రత్తగా ఉండాలి..వృషణాల భాగంలో అధిక వేడి తగలకుండా చూసుకోవాలి.

ఎంతో మంది…
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. ప్రపంచంలో 8 నుంచి 12 శాతం వంధ్యత్వంతో పిల్లలు పుట్టక ఇబ్బంది పడుతున్నారు. అంటే ప్రపంచంలో దాదాపు ఆరు నుంచి ఏడు కోట్ల మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. వీరిలో మగవారు స్పెర్మ్ నాణ్యత, స్పెర్మ్ కౌంట్ సరిగా లేకపోవడం వల్ల పిల్లలను కనలేకపోతున్నారనేది అక్షర సత్యం..

భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో మగవారిలో సంతానోత్పత్తి సమస్యలు పెరుగుతున్నాయి. వీరిలో వీర్యకణాల సంఖ్య పడిపోవడం వల్ల వారు పిల్లల్ని కనలేకపోతున్నారు. ఈ మధ్య జరిగిన ఓ స్టడీలో కూడా భవిష్యత్తులో మగవారి సంఖ్య తగ్గిపోతుందని తేలింది.. అలాగే వీర్యకణాల్లో చురుకుదనం కూడా తగ్గి అవి వేగంగా కదలలేకపోతున్నాయని నివేదిక చెబుతోంది. వందేళ్ల కిందట భారత్‌లో మగవారిలో వీర్యకణాల సంఖ్య సగటున 60 మిలియన్/ మిల్లీ లీటర్లు ఉండగా, అది ఇప్పుడు ఒక మిల్లీ లీటరుకు 20 మిలియన్లకు పడిపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో మీరే అర్థం చేసుకోవాలి.

బాడీ వేడిగా ఉండటం అనేది మగవారికే కాదు.. ఆడివారికి కూడా ప్రమాదమే..లేడీస్‌ శరీరం ఎప్పుడూ కూల్‌గా ఉండాలి.. కానీ కొంతమంది బాడీ సీజన్‌తో పనిలేకుండా బాగా హీట్‌గా ఉంటుంది. అలాంటివారు పిల్లల్ని కనడం కష్టం..ఎందుకంటే..అంత వేడిగా ఉంటే..కలయిక సమయంలో.. మగవారి నుంచి వచ్చిన వీర్యకణాలు.. ఆడివారి వేడికి తట్టుకోలేక చనిపోతాయి. సో.. మీ శరీరం ఎక్కువ హీట్‌గా ఉంటే.. దాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు ఇప్పటి నుంచే మొదలుపెట్టండి అమ్మాయిలూ..!!

Read more RELATED
Recommended to you

Exit mobile version