మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాదులో ఆయన నివాసంలో కొడుకు భద్రారెడ్డి తో కలిసి మల్లారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పడం తో పాటు నరేందర్ రెడ్డిని కలవడం మీద కూడా కేటీఆర్ కి వివరణ ఇచ్చారు.
అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీ భవనాలకు కూల్చివేతలపైన మొరపెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కి గుడ్ బాయ్ చెప్పి కాంగ్రెస్ లో చేరబోతున్నానని వస్తున్న వార్తల పైన స్పందించారు. పార్టీలు మారే అవసరం లేదని మారనని కేటీఆర్ కి క్లియర్ గా చెప్పేసారట. ఇటీవల మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి కి చెందిన కాలేజీ భవనాలని అధికారులు కూల్చివేసిన విషయం మనకి తెలిసిందే.