హైద్రాబాద్ మతసామరస్యానికి ప్రతీక : మల్లిఖార్జున్ ఖర్గే

-

కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున ఖర్గే భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన సమావేశం సందర్భంగా ఖర్గేకు రాహుల్ గాంధీ ఆత్మీయ ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. ఈ యాత్రలో భాగం కావడం సంతోషంగా ఉందన్నారు. రాహుల్ ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, మోడీ సర్కారు, RSS దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రజల మధ్య విద్వేషాలు హింస రేకెత్తిస్తున్నాయని, అన్నీ వ్యవస్థల్లో తన మననుషులను జొప్పించి నాశనం చేస్తున్నాయన్నారు. హైద్రాబాద్ మతసామరస్యానికి ప్రతీక అన్నారు.

నాకు ఈ నగరంతో మంచి అనుబంధం ఉంది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష కాంగ్రెస్ పార్టీ నెరవేర్చింది. తెలంగాణ ప్రజలను కేసీఆర్ విస్మరించి దోచుకుంటున్నాడు. కేసీఆర్ మోడీ ఇద్దరూ ఒక్కటే. పార్లమెంట్ లో అనేక బిల్లుల విషయంలో పరస్పరం సహకారం. కేసీఆర్ తెలంగాణను వదిలేసి అన్నీ రాష్ట్రాలు ఎందుకు తిరుగుతున్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లుకు కేసీఆర్ మద్దతు ఇచ్చాడు. ప్రజా వ్యతిరేక బిల్లులకు పార్లమెంట్ లో టీఆర్ఎస్ మద్దతు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. దేశంలో 13 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్న వాటిని భర్తీ చేయటం లేదు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ ఇప్పుడు సమాధానం లేదు. కేంద్రం హామీలను ఉల్లంఘించింది అందుకే రాహుల్ గాంధీ రోడ్డు ఎక్కారన్నారు మల్లికార్జున ఖర్గే.

Read more RELATED
Recommended to you

Exit mobile version