ఇది రైతుల విజయం… వ్యవసాయ చట్టాల రద్దుపై మమతా బెనర్జీ

-

మూడు రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి మోడీ తాజాగా వెల్లడించారు. గత ఏడాది కాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో గతేడాది కాలంగా రైతుల ధర్నాలు, నిరసన దీక్షలకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. తాజగా మూడు వ్యవసాయ చట్టాల రద్దుపై పలువురు రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్విట్టర్ లో మూడు వ్యవసాయ చట్టాల రద్దపై స్పందించారు. ’ బీజేపీ మీతో వ్యవహరించిన క్రూరత్వాన్ని చూసి చలించిపోకుండా అలుపెరగని పోరాటం చేసిన ప్రతి ఒక్క రైతుకు నా హృదయపూర్వక అభినందనలు. ఇది మీ విజయం! ఈ పోరాటంలో తమ ఆత్మీయులను కోల్పోయిన ప్రతి ఒక్కరికీ నా ప్రగాఢ సానుభూతి‘  అని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. mamata banarjee

ఇదే విధంగా హర్యానా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దుష్యంత్ చౌతాాలా ’వ్యవసాయ చట్టాల రద్దును గురుపురబ్‌ సందర్భంగా రైతులకు ప్రధాని మోదీ బహుమతిగా భావించాలి… నిరసన తెలిపిన రైతులందరూ తమ ఇళ్లకు తిరిగి వచ్చి గురుపురబ్‌ను తమ కుటుంబాలతో కలిసి జరుపుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను‘ అని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. 

’మంచి వార్త! గురునానక్ జయంతి పవిత్ర సందర్భంగా ప్రతి పంజాబీ డిమాండ్లను అంగీకరించినందుకు 3 నల్ల చట్టాలను రద్దు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు అని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. 

Read more RELATED
Recommended to you

Latest news