పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తరచూ కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీ నాయకులపై విమర్శలు గుప్పిస్తుంటారు. ముఖ్యంగా దీదీ.. మోదీని టార్గెట్ చేసుకుని చాలాసార్లు విమర్శలు చేశారు. ఎప్పుడు మాటల్లోనే మోదీ ప్రభుత్వంపై నిరసన తెలిపే మమత.. తాజాగా ఎన్డీఏ సర్కార్‌పై తన వ్యతిరేకతను తెలపడానికి వినూత్న పంథాను ఎంచుకున్నారు. అదేంటంటే.. సింగింగ్. మమతా బెనర్జీ పాడటమేంటి అనుకుంటున్నారా..? ఓసారి ఈ స్టోరీ చదివేయండి మరి.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తాజాగా తన గాత్రంతో ఆకట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె పాట పాడారు. బెంగాలీ భాషలో ఆమె తన గాత్రాన్ని అందించారు. కోల్‌కతాలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండు రోజుల ధర్నా చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే రెండో రోజు ఉదయం మమతా బెనర్జీ స్వయంగా పాట పాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వం తమకు నిధులను విడుదల చేయడం లేదని దీదీ ఆరోపించారు. పనికి ఆహారపథకంతో పాటు అనేక స్కీమ్‌లకు చెందిన నిధులను కేంద్రం ఇవ్వడం లేదని వాపోయారు.
#WATCH | West Bengal CM Mamata Banerjee sings a Bengali song on the second day of her Dharna in Kolkata, against the Central government for not clearing funds for several schemes including 100 days work. pic.twitter.com/r6CRXCuqty
— ANI (@ANI) March 30, 2023