పశ్చిమ బెంగాల్లోని సిక్కు ఐపిఎస్ అధికారిని ఖలిస్తాని పేరుతో దూషించడం మీద పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. బిజెపి మతతత్వానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనమని అన్నారు. రాష్ట్రం లోని బంకురా లో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో మమత మాట్లాడారు. తలపాక ధరించిన ఐపీఎస్ ఆఫీసర్ని ఖలిస్తాని అని పేర్కొనడం సరికాదని అన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను బిజెపి పాలిత రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని ఆరోపించారు బెంగాల్ ని అభివృద్ధి చేయలేదని బిజెపి చెప్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను మాత్రం వారు పాలించే రాష్ట్రాల్లో అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు రాబోయే ఎన్నికల్లో బిజెపిని గద్దెదించాలని అన్నారు.