పీవీ ని కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్ళే మోసం చేసారు: బండి సంజయ్

-

తెలుగు ప్రధాని పివి నరసింహారావు కి బిజెపి ప్రభుత్వం భారతరత్న ప్రకటించినా కనీసం సంతోషం కూడా వ్యక్తం చేయని పార్టీ కాంగ్రెస్ అని సంజయ్ అన్నారు. పీవీ లాంటి గొప్ప వ్యక్తి చనిపోతే కనీసం ఢిల్లీలో అంత్యక్రియలు కూడా జరపకుండా ఆయన ఆత్మని ఆయన కుటుంబ సభ్యుల్ని అడుగడుగునా అవమానించింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. పివి ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు అవమానించిందో ఇప్పటికీ వివరణ ఇవ్వలేదని అన్నారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని కూడా అడుగడుగునా కాంగ్రెస్ అవమానించిందని అన్నారు.

భారతరత్నతో పాటుగా ఆయన నడయాడిన ప్రదేశాలని బిజెపి పంచ తీర్థాలుగా ప్రకటించిందని అన్నారు. పీవీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు బండి సంజయ్. కెసిఆర్ అందరిని వాడుకుని వదిలేసే రకమని విమర్శలు గుప్పించారు ఎన్నికలప్పుడే పీవీ గుర్తొస్తారని ఎన్నికలు అయిపోగానే మర్చిపోతారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news