చర్మసంబంధిత వ్యాధితో బాధపడుతున్న మరో హీరోయిన్​

-

‘యమదొంగ’ సినిమాలో ప్రత్యేకపాత్రతో గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్‌ మమతా మోహన్‌దాస్‌. ఆ తర్వాత వరస ఆఫర్లు రావడంతో తెలుగు సినిమాల్లో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. కెరీర్‌లో మంచి స్థాయిలో ఉన్నప్పుడే ఈ బ్యూటీ క్యాన్సర్ బారిన పడింది. ఆ మహమ్మారిని జయించిన ఈ భామ మరో వ్యాధితో బాధ పడుతోందట.

తాను చర్మసంబంధ వ్యాధి(Vitiligo)తో బాధపడుతున్నట్లు చెప్పింది మమతా మోహన్‌దాస్. దీని కారణంగా చర్మంపై తెల్లటి మచ్చలు ఏర్పడినట్లు తెలిపింది. ప్రస్తుతం దానికి చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పింది.

ఇన్‌స్టాలో మేకప్‌ లేకుండా ఉన్న ఫొటోలు పోస్ట్ చేసిన మమతా.. “‘‘ప్రియమైన సూర్యుడా.. నాకు గతంలో కంటే ఇప్పుడు నీ కాంతి ఎక్కువ అవసరం. నేను నా రంగును కోల్పోతున్నాను. నేను ప్రతిరోజు ఉదయం నీకోసం ఎదురుచూస్తుంటాను. ఆ పొగమంచులో సూర్యకిరణాలు మెరుస్తుంటే చూస్తున్నాను. అవి నన్ను తాకాలని వాటికోసం బయటకు వస్తున్నాను. నాకు ఇప్పుడు వాటి అవసరం ఉంది. నీ దయతో ఇక్కడ ఉన్నాను. నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను” అని పోస్టు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version