ఇండియాలో పాపులరవుతున్న బయ్‌ నౌ, పే లేటర్‌.. ఇంతకీ BNPL అంటే ఏంటి..?

-

ఒకప్పుడు మన దగ్గర డబ్బులు ఉంటేనే ఏదైనా కొనుగోలు చేసేవాళ్లం..కానీ ఇప్పుడు కొనాలన్న ఆశ ఉంటే చాలు ఎలా అయినా షాపింగ్‌ చేసేస్తున్నాం.. ఆన్‌లైన్‌ మాయాజాలం.. క్రెడిట్‌ కార్డులు విచ్చలవిడిగా ఇస్తున్నారు.. మరోవైపు.. బయ్ నౌ, పే లేటర్ (BNPL) అనే పేమెంట్ ఆప్షన్‌ బాగా పాపులర్ అవుతోంది. BNPL అనేది వస్తువులను కొనుగోలు చేయడానికి.. వాటిని తర్వాత చెల్లించడానికి ఒక సులువైన మార్గం.. ఈ మంథ్‌ శాలరీ అయిపోయిందే అని కంగారుపడక్కర్లా.. ఆ BNPL ఆప్షన్‌ ద్వారా ఈజీగా షాపింగ్‌ చేసేయొచ్చు.. అయితే ఈ ఆప్షన్‌ గురించి ఓ స్టడీ ఆసక్తికరమైన విషయాలు చెప్పింది అవేంటంటే..
GlobalData అనే సంస్థ ఈ ఆప్షన్ గురించి స్టడీ చేసి చాలా ఆసక్తికర విషయాలు చెప్పింది.. ఈ స్టడీ ప్రకారం, భారతదేశంలో బయ్ నౌ, పే లేటర్ (BNPL) పేమెంట్ సర్వీస్ రాబోయే కొన్నేళ్లలో బాగా పాపులరవుతుందట.. అలానే ఈ రకమైన పేమెంట్ ట్రాన్సాక్షన్ వ్యాల్యూ 2022 నుంచి 2026 వరకు ఏటా 32.5% పెరుగుతుందని ఈ స్టడీ అంచనా వేస్తోంది.. దీనర్థం 2026 నాటికి, ఈ ట్రాన్సాక్షన్ వ్యాల్యూ సుమారు $15 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. షార్ట్ టర్మ్ లోన్స్‌, ఆన్‌లైన్‌లో కొనుగోళ్ల వల్లే ఈ ఆప్షన్‌కి వాల్యూ పెరుగుతోంది.

బయ్ నౌ, పే లేటర్ అంటే…

BNPL అనేది షార్ట్ టర్మ్ లోన్ లాంటిది. ఈ పేమెంట్ ఆప్షన్‌లో దుకాణం లేదా కంపెనీ యాజమాన్యం మీరు కొన్న వస్తువుకు డబ్బులు కట్టకుండానే మీకు ఇచ్చేస్తుంది.. మీరు ఆ వస్తువు కోసం డబ్బులు చెల్లించడానికి సాధారణంగా కొంత సమయం ఉంటుంది. మీరు వడ్డీ లేకుండా డబ్బును తిరిగి చెల్లించాల్సిన సమయం కంపెనీని బట్టి 15 నుంచి 45 రోజుల వరకు మారవచ్చు. అలానే క్రెడిట్ పరిమితి రూ.500 నుంచి రూ.1 లక్ష వరకు మారవచ్చు. ఆ నిర్దిష్ట సమయంలోగా ఎలాంటి వడ్డీ లేకుండా మీరు డబ్బులు చెల్లించవచ్చు. ప్లాట్‌ఫామ్‌ను బట్టి ఈ వడ్డీ రేటు మారుతుంది.. ఈ సేవను ఉపయోగించడానికి చాలా కంపెనీలు మీ ప్రభుత్వ ID, బ్యాంక్ ఖాతా వివరాలు వంటి పర్సనల్ డీటెయిల్స్ అందించాలని కోరతాయి.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు

BNPLని ఉపయోగిస్తున్నప్పుడు, మీరు సకాలంలో డబ్బును తిరిగి చెల్లించకపోతే, కంపెనీలు ఆలస్యమైన పేమెంట్స్‌కు గాను మీ నుంచి ఎక్స్‌ట్రాగా లేట్ పేమెంట్ ఫీజు, ఇంట్రెస్ట్ వసూలు చేస్తాయి.. దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్‌ పడిపోతుంది.. క్రెడిట్‌ స్కోర్‌ పడిపోతే.. మీకు భవిష్యత్తులో లోన్‌, క్రెడిట్ కార్డులు, ఇంకా ఇలాంటి ఆన్‌లైన్‌ ఆప్షన్స్‌ అన్నీ కష్టమైపోతాయి.. ఒక వ్యక్తికి క్రెడిట్‌ స్కోర్‌ అనేది గుడ్‌విల్‌ లాంటిది.. అది ఎంత ఎక్కువగా ఉంటే మనకు అంత ఈజీగా లోన్స్‌ వస్తాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version