లాక్ డౌన్ ని ఉల్లంఘించకుండా ఇంట్లో ఉండి ప్రాణాలు కాపాడుకోవాలని పోలీసులు ఎన్ని విధాలుగా సూచనలు చేస్తున్నా కొందరు మూర్ఖులు మాత్రం మాట వినడం లేదు. ములక్కాయలు ఇవ్వడానికి, లూజ్ అయిన అండర్ వేర్ మార్చుకోవాలని రోడ్ల మీదకు వస్తున్నారు. అమ్మా అని చెప్పినా వినడం లేదు, అయ్యా అని చెప్పినా వినడం లేదు. కొడితే కొట్టారని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు
ముఖ్యమంగా హైదరాబాద్ లో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అవసరం లేకపోయినా సరే ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీదకు వచ్చి తిరుగుతున్నారు. వారి విషయంలో పోలీసులు ఇక కఠినం గా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుని వాహనాలను కూడా సీజ్ చేస్తున్నారు. అయినా సరే మాట వినడం లేదు. తాజాగా రోడ్డు మీదకు ఎందుకు వచ్చావని ప్రశ్నించినందుకు ఒక ఎస్సై మీద దాడికి దిగాడు ఒక ప్రబుద్దుడు.
ఇంటి నుంచి బయటకు రావద్దని చెప్పిన సబ్ ఇన్‌స్పెక్టర్‌పై దాడి చేసాడు వనస్థలీపురంలో గౌతమినగర్ రోడ్డు నంబర్ 5లో ఎస్‌ఐ కె. వెంకట్‌రెడ్డి పెట్రోలింగ్ నిర్వహిస్తు౦డగా… ఇద్దరు వ్యక్తులు బయట ఉన్నారు. ఇంట్లోకి వెళ్ళాలి అని సూచించారు. అయినా వినకపోవడంతో ఇంట్లోకి వెళ్ళకపోతే చర్యలు తీసుకుంటామని… హెచ్చరించగా చందా ప్రమోద్ అనే వ్యక్తి ఆవేశంగా… దురుసుగా మాట్లాడటమే కాకుండా ఎస్‌ఐ చెంపపై కొట్టాడు. డ్యూటిలో ఉన్న పోలీసుపై దాడి చేసినందుకు రిమాండ్ కి తరలించారు.