భార్య‌కు గుడి క‌ట్టిన భ‌ర్త‌.. ఆధునిక షాజ‌హాన్‌

-

ప్ర‌స్తుత స‌మాజంలో పెళ్లైన సంవ‌త్స‌రానికో, నెల‌కో లేదా కేవ‌లం కొన్ని రోజుల‌కో వ‌దిలేసిన భ‌ర్త‌ల‌ను చూస్తుంటాం. అయితే కొంద‌రు మాత్రం మ‌న‌స్పూర్తిగా ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తుంటారు. ఈ క్ర‌మంలోనే చాలా మంది అమ్మ‌, భార్య‌, పిల్ల‌లు, అక్కా, అన్న‌ల‌పై ఇలా ఎన్నో ర‌కాలుగా వారి ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రుస్తారు. అలాగే కొంద‌రు వారి ప్రేమ‌కు గుర్తుగా గుళ్ల‌ను కూడా నిర్మిస్తుంటారు. పెంచి పెద్దచేసిన తలిదండ్రుల్ని మరచిపోతున్న పిల్లలున్న ఈ రోజుల్లో ప్ర‌ముఖ సినీ న‌టుడు లారెన్స్ బ‌తికుండాగానే త‌ల్లికి గుడి క‌ట్టి త‌న ప్రేమ‌ను చాటుకున్నాడు.

అయితే ఎక్కువ‌గా త‌మిళ‌నాడు ప్రాంతంలో వారి ప్రేమ‌కు చిహ్నంగా గుళ్ల‌ను క‌ట్టిస్తుంటారు. ఈ జాబితాలోకే వ‌చ్చే ఓ భ‌ర్త త‌న భార్య‌కు గుడి కట్టేశాడు. ఆధునిక షాజ‌హాన్‌గా నిలిచిపోయాడు. తన భార్య మరణాన్ని తట్టుకోలేక ఆమెకి గుడి కట్టి తన ప్రేమను చాటుకున్నాడు. ఇక వివరాల్లోకి వెళ్తే తమిళనాడులోని ఎరుమైయారుకి చెందినా రవి చెన్నై కార్పోరేషన్లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతనికి రేణుకతో 32 సంవత్సరాల క్రితం వివాహం అయింది .

అయితే రేణుక అనారోగ్య సమస్యలతో మరణించింది. అమె మరణం రవిని బాగా కలిచివేసింది. ఆమె జ్ఞాపకాల కోసం 9 అడుగుల పోడువుతో 16 అడుగుల వెడల్పుతో గుడి కట్టించాడు. అ ఆలయంలో ఆమెకి నిత్యం పూజలు చేస్తున్నాడు. రవి,రేణుకకి ఇద్దరు కుమారులు ఉన్నారు. తనకి తన భార్య అంటే ఎంతో ఇష్టమని, నా చేతి వాచ్ లో , ఉంగరంలో,చొక్కా బటన్ లో కుడా నా భార్య ఉంటుందని రవి తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version