సూర్యగ్రహణం రోజు ఇంటినే కాదు.. కంప్యూటర్లు, టీవీలు కూడా క‌డిగేస్తున్నారుగా.. వైరల్ వీడియో

-

భారతదేశంలో మూడ నమ్మకాలో, లేక వాళ్ళ విశ్వాసాలో తెలియదు గాని ప్రతీ ఒక్కరు ఏదోక సందర్భంలో కొన్ని అనుసరిస్తూ ఉంటారు. వాళ్ళ వాళ్ళ నమ్మకాలతో కొన్ని కొన్ని తప్పక ఫాలో అవుతారు. లేకపోతే వాళ్లకు చెడు జరుగుతుందనే భయ౦ వాళ్ళను వెంటాడుతుంది. గురువారం సూర్యగ్రహణం ఉండటంతో దేశంలో ప్రజలు అందరూ ఆసక్తిగా దాన్ని తిలకించారు. గ్రహణం ముందు దేవాలయాలను మూసి వేసి తర్వాత వాటిని శుద్ధి చేస్తారు.

ఇళ్ళల్లో కూడా గ్రహణం పూర్తి అయిన తర్వాత స్నానం చేయడం, ఇల్లు శుద్ధి చేసుకోవడం వంటివి మనం చూస్తూ ఉంటాం. కొందరు అయితే ఇళ్ళు శుభ్రం చేసుకోవడంతో పాటుగా ఇంట్లో ఉన్న దేవుడి గదిని శుద్ధి చేసుకోవడం అనేది మనం చూస్తాం. దానాలు చేయడం, అభిషేకాలు జరిపిస్తూ ఉంటారు. గ్రహణ సమయంలో జపం ధ్యానం చేస్తూ ఉంటారు. విశేష ఫలితాలు ఉంటాయని నమ్ముతారు.

కాని ఒక వ్యక్తి మాత్రం ఇంట్లో ఉన్న ఎలక్ట్రానికి వస్తువులను నీళ్ళ పైప్ పెట్టి కడుగుతూ ఉంటాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ ని ఊపేస్తుంది. ఇంట్లో ఉన్న టీవీ, డెస్క్ టాప్ వంటి వాటివి, శుభ్రం చేస్తూ ఉంటాడు. ఈ సందర్భంగా తీసిన వీడియో వైరల్ అవుతుంది. అందితే సూర్యుడ్ని కూడా కడుగుతాడని వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీ ఇల్లు కడగాలి అంటే అతన్ని పిలిచేయండి అంటూ పోస్ట్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున వాట్సాప్ స్టేటస్ లు కూడా పెడుతున్నారు. మీరు కూడా వీడియో ని ఒక లుక్ వేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version