సంక్రాంత్రి పండుగ సమయంలో తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి. కొందరు మద్యం మత్తులో ప్రమాదాలకు గురైతే మరికొందరు అతివేగం వలన ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కనుమ నాడు రోడ్డు ప్రమాదంలో ఓ ఆటో డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు.
ఈ ఘటన కూనూరు సమీపంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు గ్రామానికి చెందిన కొండ శ్రీకాంత్ (27) ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ప్రమాదవశాత్తు కూనూరు వద్ద ఆటో మీద బోల్తాపడటంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.