సంక్రాంతి పండుఫూట దారుణం.. తండ్రిని హతమార్చిన కొడుకు

-

హైదరాబాద్ మహానగరాన్ని ఆనుకుని ఉన్న మేడ్చల్ జిల్లాలో సంక్రాంతి పండుగపూట దారుణం చోటుచేసుకుంది. కన్న కొడుకే తండ్రిని దారుణంగా హత్య చేసిన ఉదంతం మంగళవారం రాత్రి శామీర్‌పేట్ పీఎస్ పరిధిలో వెలుగుచూసింది.

 

పోలీసుల కథనం ప్రకారం.. శామీర్‌పేట్ మండల కేంద్రంలోని పెద్దమ్మ కాలనీలో తన కుటుంబంతో కలిసి నివాసముంటున్న అలకుంట్ల హనుమంతు (50) కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన అతను రోజు తాగి వచ్చి ఇంట్లో నానా రభస చేస్తుండేవాడు. సంక్రాంతి పండుగ రోజున కూడా ఇదే సీన్ రిపీట్ కావడంతో కొడుకు నర్సింగ్ రావు సహించలేకపోయాడు.ఆవేశంతో ఊగిపోతూ రోకలి బండతో తండ్రి హనుమంతుపై బలంగా దాడి చేశాడు. దీంతో హనుమంతు చనిపోయినట్లు పోలీసులు నిర్దారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news