ఊపిరితిత్తుల నిండా పురుగులు, ఏం తింటావ్ అని అడిగితే…!

-

ఒకరి తిండిని మనం విమర్శించ వద్దు గాని చైనాలో కొందరు తినే వెకిలి తిండి నిజంగా ప్రపంచాన్ని భయపెడుతుంది అనేది వాస్తవం. ఎం తింటున్నారో ఎంత తింటున్నారో ఎవరికి అర్ధం కాకుండాతింటున్నారు. పాములు, కప్పలు, పిల్లులు ఇలా ఇష్టం వచ్చినట్టు తింటున్నారు. గబ్బిలాలను వదలడం లేదు గోడ మీద పాకే బల్లిని వదలడం లేదు. ఒక్క మనిషిని మినహా అన్నీ తింటున్నారు.

మనిషిని కూడా తింటారేమో మనకేం తెలుసు. తాజాగా ఒక వ్యక్తి తినే తిండి చూసి వైద్యులు కూడా భయపడ్డారు. చైనాలోని సుక్వీన్ ప్రాంతానికి చెందిన వాంగ్ అనే వ్యక్తి కొన్ని రోజులు శ్వాస సంబంధిత వ్యాధితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. దీనితో అతన్ని స్థానిక ఆస్పత్రిలో జాయిన్ చేసారు. అతడికి వైద్య పరిక్షలు చేసి తమరి ఆహారపు అలవాట్లు ఏంటీ అని అడిగారు. తాను సి ఫుడ్ ని పచ్చిది తింటా అని చెప్పాడు.

పాములను చంపి పిత్తాశయాన్ని కూడా తింటా అని చెప్పడంతో నువ్వు తినే ఆహారంతో నీ ఊపిరితిత్తులను పురుగులు చుట్టేసాయి అని దీనిని పరాగోనిమియాసిస్ (Paragonimiasis) అంటారని వివరించారు. పాముల పిత్తాశయం తినడం వల్ల ఊపిరితీత్తులకు ఇన్ఫెక్షన్ సోకిందని చెప్పారు. అతడు బ్రతికే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పారు. హాస్పిటల్‌లోని రెస్పిరటరీ డాక్టర్ జహ్వో హయాన్… పాములు, సీఫుడ్‌లను పచ్చిగా తినడం వల్ల అందులో జీవించే టేప్‌వార్మ్ వంటి పరాన్నజీవుల గుడ్లు శరీరంలోకి వెళ్తాయని, అక్కడే అవి పెద్దవై అనారోగ్యానికి కారణం అవుతాయని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news