రూ.125 కోసం హత్య.. ఏం జ‌రిగిందంటే..?

-

ఈ మ‌ధ్య కాలంలో చిన్న చిన్న విష‌యాల‌కు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కొంద‌రు. ఇటీవ‌ల రూ. 2 కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగిన ఘర్షణ ఓ వ్యక్తి హత్యకు కారణమైంది. ఇక తాజాగా రూ. 125 కోసం స్నేహితుడునే హ‌త్య చేశాడొక‌డు. వివ‌రాల్లోకి వెళ్తే.. అరుప్పుకోటకు చెందిన రాబర్ట్‌ (40) విల్లుపురానికి చెందిన శివకుమార్‌ కట్టడ కార్మికులు. వీరిద్దరూ చెన్నై కేకేనగర్‌ అన్నా మెయిన్‌ రోడ్డులోని ప్లాట్‌ ఫాంపై ఉంటూ పనికి వెళ్లేవారు. బుధవారం రాత్రి మద్యం తాగుతున్న సమయంలో వీరి మధ్య గొడవ జరిగింది. శివకుమార్‌ వద్ద రాబర్ట్‌ కొద్ది రోజుల క్రితం రూ.250 అప్పు తీసుకున్నాడు.

ఇందులో రూ.125 తిరిగి ఇచ్చినట్టు తెలిసింది. మిగిలిన‌ రూ.125 తిరిగి ఇవ్వమని శివకుమార్‌ రాబర్ట్‌తో బుధవారం రాత్రి గొడవ పడ్డాడు. ఆ సమయంలో రాబర్ట్‌ శివకుమార్‌ కుటుంబం గురించి అసభ్యంగా మాట్లాడడంతో ఆగ్రహించిన శివకుమార్‌ బీర్‌బాటిల్‌ను పగులగొట్టి అతని తలపై తీవ్రంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలైన రాబర్ట్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఫిర్యాదు అందుకున్న సహాయ కమిషనర్‌ రాధాకృష్ణన్, కేకే.నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌ విచారణ చేసి శివకుమార్‌ను అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version