ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటున్నారా…? ఈ జాగ్రత్తలు తీసుకోండి…!

-

చదువుకోవాలని ఆశ ఉండి… చదువుకోవడానికి డబ్బులు లేక ఇబ్బందులు పడే వాళ్ళు ఎందరో… తల్లి తండ్రులకు చదివించాలనే కోరిక ఉండి కూడా డబ్బులు లేక పిల్లలను ఉన్నత చదువులు చదివించలేకపోతున్నారు. ఇలాంటి వారికి అండగా నిలుస్తున్నాయి విద్యా రుణాలు. అన్ని ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకు లు దీనిని అందిస్తున్నాయి. చదువుకి తగిన విధంగా రుణాలు అందిస్తూ తమ వంతు సహకారం అందిస్తున్నాయి. ఇక విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకునే వారి కోసం కూడా భారీగా రుణాలు ఇస్తున్నాయి బ్యాంకులు.

ఈ నేపధ్యంలో పలువురు కీలక సూచనలు చేస్తున్నారు… ఎడ్యుకేషన్ లోన్ రావడం సులువే గాని… వాటిని కట్టే సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. లోన్ తీసుకునే ముందు… కచ్చితంగా బ్యాంకు విధించిన గడువు నుంచి వాయిదాలు కట్టే విధంగా అయితేనే తీసుకోవాలని అంటున్నారు.ఉదారహణకు… 2019 ఆగస్ట్ లో లోన్ వచ్చింది… మీకు 28 నెలలు గడువు విధిస్తే… మొదటి నెల నుంచే మీరు కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత మూడు నెలలకు మీరు కడదాం అని ఆలోచిస్తే… ఆదిలోనే మీ క్రెడిట్ స్కోర్ పడిపోతుంది…

Source& credits : career360

ఆ తర్వాత మీరు ఎంత సక్రమంగా చెల్లించినా సరే అది పెరిగే అవకాశాలు చాలా తక్కువ… ఉదాహరణకు మూడు వేలు వాయిదా అయితే కొంత మంది రెండు వేలు ఈ నెల కట్టి వచ్చే నెల 4 వేలు కట్టి సమం చేస్తూ ఉంటారు… దీని కారణంగా కూడా క్రెడిట్ స్కోర్ పడిపోయే అవకాశం ఉంది. అదే జరిగితే మీకు భవిష్యత్తులో క్రెడిట్ కార్డు రావడం అనేది చాలా కష్టంగా మారుతుంది. ఒకవేళ ఇలా తప్పు జరిగితే గనుక… మీరు ముందే… అంటే… మీ వద్ద ఎక్కువ మొత్తంలో డబ్బులు ఉన్నప్పుడు లోన్ క్లియర్ చేసుకుంటే మంచిది అంటున్నారు.

ఈ రోజుల్లో క్రెడిట్ కార్డు గాని, పర్సనల్ లోన్ గాని చాలా అవసరం… వాటి వలన ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మీరు ఎడ్యుకేషన్ లోన్ కట్టే విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే మీకు ఎంత జీతం వచ్చినా సరే క్రెడిట్ స్కోర్ అనేది పెరిగే అవకాశం ఉండదు. దీని కారణంగా బ్యాంకింగ్ లేదా ఇతర సంస్థల నుంచి రుణాలు పొందే అవకాశం ఉండదు. దాదాపు పది నుంచి 12 ఏళ్ళ పాటు మీరు బ్యాంకింగ్ లావాదేవీలను సక్రమంగా నిర్వహిస్తే గాని దాని నుంచి బయటపడలేరు. అందుకే ఎడ్యుకేషన్ లోన్ తీసుకునే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version