జూబ్లీహిల్స్ లో వ్యక్తి దారుణ హత్య !

-

జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో వ్యక్తి హత్యకు గురయ్యాడు. నిన్న రాత్రి 2 గంటల ప్రాంతంలో శివ అనే 40 ఏళ్ల వ్యక్తి హత్యకు గురయ్యాడు. అతడు కూలి పని చేసుకుంటూ, ఫూట్ పాత్ పై జీవిస్తున్నారని తెలుస్తోంది. గత రాత్రి రోడ్ నెంబర్ 10 B ఫూట్ పాత్ పై  తోటి కూలీలు మరో ముగ్గురు డేవిడ్, శ్రీనివాస్, రాకేష్ లతో కలిసి మద్యం సేవించారు. మధ్యరాత్రి తర్వాత రాకేష్, శ్రీనివాస్ వెళ్లిపోగా మృతుడు శివ మరియు డేవిడ్ అక్కడే ఉన్నారు.

తెల్లవారుజామున 2.20 గంటల ప్రాంతంలో శ్రీనివాస్ మళ్ళీ వచ్చి చూడగా మృతుడు మద్యం సేవించిన ప్రదేశంలోనే తల పగిలి రక్తపు మడుగులో చనిపోయి పడి ఉన్నాడు. దీన్త్ప్ వెంటనే శ్రీనివాస్ డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించగా జూబ్లీహిల్స్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. డేవిడ్ అక్కడ లేకపోవడంతో అతనే ఏమయినా చేశాడా ? అనే అనుమానం వ్యక్తం అవుతోంది.ఇక అనుమానితుడు డేవిడ్ కోసం మూడు బృందాలతో గాలింపు చేపట్టారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version