ఇంట్లో సిలిండర్ పేలితే.. రూ.50 లక్షల ప్రమాద బీమా.. క్లెయిమ్ ప్రాసెస్ తెలుసుకోండిలా..!

-

గ్యాస్ సిలిండర్లు పేలి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగే సంఘటనలు తరచూ చూస్తూనే ఉంటాం. ఎక్కడైనా ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలినప్పుడు ఆ ఇళ్లు మొత్తం దగ్ధం అవుతుంది. ఇళ్లు మొత్తం మంటలు చెలరేగుతూ కనిపిస్తుంటాయి. గ్యాస్ కనెక్షన్‌లో సమస్య ఉండి, గ్యాస్ లీకై మంట రాచుకున్నప్పుడు ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తాయి. ఇలాంటి సంఘటనలు తరచూ మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. ఆకస్మికంగా జరిగే ఈ ఘటన వల్ల చాలా మంది ప్రాణాలు, ఆస్తి నష్టం జరుగుతుంది. అయితే అలాంటి పరిస్థితిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎల్‌పీజీ వినియోగదారుల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగినప్పుడు పెట్రోలియం కంపెనీలు అందించే బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం.

lpg-cylinder

రూ.50 లక్షల ప్రమాద బీమా..
పెట్రోలియం కంపెనీలు ఎల్‌పీజీ కనెక్షన్ తీసుకున్నప్పుడు వినియోగదారులకు వ్యక్తిగత ప్రమాద కవర్‌ను అందిస్తుంది. ఈ బీమా రూ.50 లక్షల వరకు ఉంటుంది. లీకేజీ ద్వారా గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదం జరిగినప్పుడు ఆర్థికసాయం లభిస్తుంది. ఈ మేరకు బీమా అమలుకు సంబంధించిన పెట్రోలియం కంపెనీలు బీమా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రస్తుతం హిందూస్తాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిన్, భారత్ పెట్రోలియం సంస్థల ఎల్‌పీజీ కనెక్షన్లపై బీమా పొందవచ్చు. అయితే ఎల్‌పీజీ సిలిండర్ల లీకేజీ జరగకుండా చూసే బాధ్యత పెట్రోలియం కంపెనీలు, డీలర్లది. 17 ఏళ్ల కింద జరిగిన ఒక ప్రమాదంపై నేషనల్ కన్స్యూమర్ ఫోరం ఈ ఉత్తర్వులను అమలు చేసింది. మార్కెటింగ్ డిస్‌పెల్లాన్ గైడ్‌లైన్ 2004 ప్రకారం.. డీలర్లు లోపభూయిష్టంగా సిలిండర్ సరఫరా చేసినప్పుడు, గ్యాస్ కనెక్షన్‌లో ప్రాబ్లమ్, గ్యాస్ పైపుల నుంచి గ్యాస్ లీకవడం వంటి వాటితో ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయి. అందుకే గ్యాస్ డెలివరీ చేసినప్పుడు సరిగ్గా చూసి క్రయవిక్రయాలు నిర్వహించాలి.

గ్యాస్ సిలిండర్ పేలినప్పుడు పెట్రోలియం కంపెనీల ద్వారా నష్ట పరిహారాన్ని చెల్లించుకోవచ్చు. ఒక్కో సంఘటనకు రూ.50 లక్షలు, ఆస్తి నష్టం జరిగితే రూ.2 లక్షల వరకు బీమా క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రమాదంలో వ్యక్తి మరణించినట్లయితే రూ.6 లక్షలు, గాయాలైనప్పుడు వైద్య ఖర్చుల కోసం రూ.30 లక్షల వరకు అందిస్తారు. అలాగే తక్షణ సాయం కింద రూ.25 అందజేస్తారు. అయితే ఈ నష్టం పరిహారం చెల్లించాలంటే కొన్ని షరతులు వర్తిస్తాయి. కేవలం గ్యాస్ ఏజెన్సీలో నమోదు చేసుకున్న కస్టమర్ ఇంటి వద్ద ప్రమాదం జరిగినప్పుడు బీమా వస్తుంది. గ్యాస్ సిలిండర్ పేలినప్పుడు బీమా పొందాలంటే కస్టమర్ వెంటనే పోలీస్ స్టేషన్‌, ఎల్‌పీజీ డీలర్లు ఫిర్యాదు చేయాలి. పోలీసుల నుంచి ప్రమాదం జరిగినట్లు ఒక పత్రాన్ని రాయించుకోవాలి. అలాగే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, మెడికల్ బిల్లుల ధ్రువ ప్రతాలను అందించడం ద్వారా బీమా క్లెయిమ్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version