దారుణం : ఇనుప రాడ్ తో కూతురు, భార్యను కొట్టి చంపిన వ్యక్తి 

-

తెలంగాణాలోని హుజురాబాద్ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య, కన్న కూతరుని దారుణంగా కొట్టి చంపాడు భర్త. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇనుప రాడ్‌తో భార్య, కూతురును బలంగా కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న వెంకటేశ్‌ పట్టణ శివారులోని మధు టాకీస్ ప్రాంతంలో తన కుటుంబంతో నివాసముంటున్నాడు.

murder

కూతురుకి వివాహం అయినప్పటికీ ఆమె పుట్టింట్లోనే ఉంటోంది. అయితే గత కొంత కాలంగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో ఈరోజు ఉదయం భార్య రమ (45), కూతురు ఆమని (25) తలపై ఇనుపరాడ్డుతో బలంగా కొట్టి హత్య చేశాడు వెంకటేశ్‌ . అనంతరం హుజూరాబాద్‌ పోలీసుల ముందు లొంగిపోయాడు. కుటుంబ కలహాల కారణంగానే హత్యలు జరిగాయని పోలీసులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version