లాక్ డౌన్.. భార్య పుట్టింట్లో ఆగిపోవడంతో మరో పెళ్లి చేసుకున్న భర్త

-

కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్ డౌన్ కారణంగా నిత్యావసరాలు తప్ప అన్ని సేవలు నిలిచిపోయాయి. ప్రజా రవాణా స్తంభించింది. దీంతో పలు కుటుంబాలకు చెందిన కొందరు వ్యక్తులు వేరే చోట చిక్కుపోవాల్సి వచ్చింది. సొంతవారి దగ్గరికి వెళ్దామంటే వెళ్లలేని పరిస్థతి నెలకొనడంతో.. వారు ఉన్న చోటనే ఉండిపోయారు. అయితే బిహార్‌లో ఓ వ్యక్తి భార్య కూడా పుట్టింట్లో ఉండిపోయింది. దీంతో ఆ వ్యక్తి ఇదే మంచి చాన్స్ అనుకున్నాడమో కానీ తన మాజీ ప్రేయసి మెడలో మూడు ముళ్లు వేశాడు.

వివరాల్లోకి వెళితే.. బిహార్ రాజధాని పాట్నాలోని పాలిగంజ్‌కు చెందిన ధీరజ్ కుమార్‌కు దుల్హిన్ బజార్‌కు చెందిన ఓ యువతితో ఇటీవలే పెళ్లి జరిగింది. అయితే ఆమె పుట్టింటికి వెళ్లిన సమయంలో.. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆమె తన భర్త దగ్గరకు రాలేకపోయింది. అయితే భార్య తిరిగిరాకపోవడంతో.. ధీరజ్ ఆమెకు ఫోన్ చేసి తన ఇంటికి రావాల్సిందిగా కోరాడు. రవాణా సదుపాయం లేకపోవడంతో పుట్టింటి వద్దే ఉండిపోవాల్సి వచ్చింది. అదే విషయాన్ని ఆమె తన భర్తకు వివరించింది.

అయితే లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ.. భార్య చెప్పిన మాటలు పట్టించుకోకుండా ఆవేశంతో ధీరజ్ మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. తన మాజీ ప్రేయసిని వివాహం చేసుకున్నాడు. ఈ విషయం కాస్త ధీరజ్ భార్యకు తెలువడంతో ఆమె షాక్‌కు గురయింది. వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో తన భర్తపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ధీరజ్‌ను పిలిపించి విచారణ చేపట్టారు. తను రెండో పెళ్లి చేసుకున్నట్టు ధీరజ్ అంగీకరించడంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news