VIRAL VIDEO : చికెన్ బిర్యానీ లేదని రెస్టారెంట్‌కు నిప్పంటించిన కస్టమర్

-

బిర్యానీ అంటే ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా చికెన్ బిర్యానీ చాలా మంది ఫేవరెట్. ఇండియాలో బిర్యానీ ప్రియులకు ఢోకా లేదు. కానీ విదేశాల్లో ఉన్నవారు చికెన్ బిర్యానీ తినాలనుకుంటే కాస్త కష్టమే. వారి కోసమే విదేశాల్లోనూ అక్కడక్కడ బిర్యానీ రెస్టారెంట్లు ఉంటాయి. ప్రత్యేకంగా బిర్యానీ కోసమే చాలా మంది చాలా దూరం ప్రయాణించి మరీ వెళ్లి తమ ఫేవరెట్ బిర్యానీ లాగించేస్తారు. అలా న్యూయార్క్ లోని క్వీన్స్ ఏరియా జాక్సన్‌ హైట్స్‌లోని దక్షిణాసియా సంఘం భవనంలో ఉన్న ఓ బంగ్లాదేశీ రెస్టారెంట్ కు వెళ్లాడు 49 ఏళ్ల  చోఫెల్ నోర్బు.

అయితే చోఫెల్ వెళ్లేసరికే ఆ రోజు కోటా బిర్యానీ అయిపోయింది. చోఫెల్ చికెన్ బిర్యానీ కావాలని అడగ్గా.. రెస్టారెంట్ యజమాని లేదని సమాధానమిచ్చాడు. మీడియాలో వైరల్‌గా మారింది. ఇక చోఫెల్ కోపం నశాలానికి అంటింది. వెంటేనే వెళ్లి పెట్రోల్‌ తీసుకొచ్చి రెస్టారెంట్ పై చల్లి నిప్పంటించాడు. ఈ ఘటనతో రెస్టారెంట్ లోని సామగ్రి పూర్తిగా దగ్ఘమైంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి హాని జరగలేదని సమాచారం.

ఈ ఘటన రెస్టారెంట్ బయట ఉన్న సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమైంది. ఫుటేజీలో చోఫెల్‌ నోర్బు రెస్టారెంట్ దగ్గర నిలబడి ఉండటం, కొద్ది సేపటి తర్వాత పెట్రోల్‌ చల్లి నిప్పంటించడం కనిపిస్తోంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మద్యం సేవించి ఉన్న తనకు తినేందుకు బిర్యానీ లేదని చెప్పడంతో కోపం వచ్చి నిప్పుపెట్టినట్లు నోర్బు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version