హైట్‌ పెరగడానికి ఎన్ని లక్షలు ఖర్చు చేశాడో తెలుసా..

-

ప్రతి ఒక్కొక్కరికి ఒక్కో ఎత్తు ఉంటుంది. అయితే కొందరు వయస్సుకు తగ్గట్టుగా ఎత్తు ఉంటారు.. మరికొందరు అస్సలు ఊహించని రీతిలో పొట్టిగా ఉంటారు. అయితే.. కొందరు ఎత్తు తక్కువగా ఉందని ఆస్పత్రులను ఆశ్రయించి సర్జరీలు చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అదీ సాధ్యం కాకపోతే, దేవుడిచ్చిన రూపంతోనే సర్ధుకుంటారు. కానీ.. ఓ వ్యక్తి, ఎలాగైన సరే తన ఎత్తు పెంచాలని నిర్ణయించి ఏకంగా రూ. 55 లక్షలు ఖర్చుచేసి మూడు అంగుళాలు ఎత్తు పెంచుకొని తన కలను సాకారం చేసుకున్నాడు.

అమెరికాలోని డల్లాస్‌కు చెందిన ఆల్ఫోన్సో ఫ్లోరెస్‌ (28) అతడి ఎత్తు ఐదడుగుల పదకొండు అంగుళాలు. అయినా అతను ఆ ఎత్తుతో సంతృప్తిగా పడలేదు. ఇంకాస్తు ఎత్తు పెరగాలని నిర్ణయించుకున్నాడు. అందుకు లాస్‌వెగాస్‌లోని వైద్యులు కెవిన్‌ డెబీపర్షద్‌ను సంప్రదించగా, ఎత్తు పెరగడానికి సులువైన మార్గం లింబ్‌ లెంథనింగ్‌ కాస్మటిక్‌ సర్జరీని చేయించుకోవాలని సూచించారు.

ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా..

ఆల్ఫోన్సో అంగీకరంతో రూ. 55 లక్షలు ఖర్చు చేసి ఆపరేషన్‌ పూర్తయింది. ముందుహైట్‌ కన్నా మూడంగుళాల ఎత్తు పెరిగాడు. ఐదు అడుగుల 11 అంగుళాలు ఉన్న అతడు ఆరు అడుగుల 1 అంగుళంగా మరాడు. అంత పెద్ద సర్జరీ జరిగినా ఇప్పటి వరకు అల్ఫోన్సోకు ఎలాంటి దుష్ప్రభాలు లేవని అంటున్నాడు. ఇలాంటి కాస్మటిక్‌ సర్జరీలు చేసుకున్న వారిలో కొన్ని సార్లు తీవ్రమైన దుష్ప్రభావాలు చూపిస్తాయని వైద్య నిçపుణులు అంటున్నారు. అయితే ఇదే తరహలో హైదరాబాద్‌కు చెందిన నిఖిల్‌రెడ్డి అనే ఓ యువకుడు తన ఎత్తు పెంచుకునేందుకు 2016 సర్జరీ చేసుకొని తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version