చదువు మీది… ప్రోత్సాహం మాది… మన మిర్యాలగూడ ఆర్గనైజర్స్

-

చ‌దువుకునే రోజులు పోయి చ‌దువు కొనే రోజులు వ‌చ్చాయి. పేద విద్యార్థుల‌కు ఉన్న‌త చ‌దువులు అంద‌ని ద్రాక్షాగానే మిగిలిపోతున్నాయి. కాలేజీ టాప్ ర్యాంక‌ర్లు, జిల్లా స్థాయి ర్యాంకులు సాధించిన ఎంద‌రో విద్యా కుసుమాలు అర్థాంత‌రంగా చ‌దువును మానేసిన ఘ‌ట‌న‌లు ఎన్నో.. చదువుకునే ఇష్టం ఉండి ఆర్థిక ప‌రిస్థితి స‌రిగాలేని విద్యార్థుల కోసం మ‌న మిర్యాల‌గుడ అనే సంస్థ ప్రోత్సాహాన్నందిస్తోంది.

చ‌దువు మీది.. ప్రోత్సాహం మాది అంటూ ముందుకొచ్చింది మ‌న మిర్యాల‌గూడ అనే స్వ‌చ్ఛంద‌ సంస్థ.
మిర్యాలగూడ కు చెందిన హారిక (పేరు మార్చాం) చదువులలో టాప్‌. ఆర్థికంగా వెన‌క‌బ‌డి ఉన్న కుటుంబానికి చెందిన హారిక  క‌ష్ట‌ప‌డి ప్ర‌ముఖ కాలేజీలో ఇంజనీరింగ్ ఫ్రీ సీట్ ను సంపాదించగలిగింది. అయినా హాస్ట‌ల్ ఫీజు చెల్లించే ప‌రిస్థితి లేక చ‌దువు వ‌దిలేసే ద‌శ‌లో మ‌న మిర్యాలగూడ సంస్థ తామున్నామంటూ ఆదుకుంది.

గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా హాస్ట‌ల్ ఫీజులు చెల్లిస్తుంది. కోవిడ్ కారణంగా ఆన్లైన్ తరగతులు కొనసాగుతున్నందున 50 వేల రూపాయల విలువ చేసే ల్యాప్ టాప్ ను మన మిర్యాలగూడ ఆర్గనైజర్స్ అంద‌జేస్తూ, చదువులో రాణిస్తూ పేదరికంతో ఉన్న విద్యార్థులకు మన మిర్యాలగూడ ఆర్గనైజర్స్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ పై చదువులు చదివించడానికి మేము ఎప్పుడూ ముందే ఉంటామ‌ని సంస్థ ఆర్గ‌నైజ‌ర్స్ వెల్ల‌డించారు. ఇంకా ఇలాంటి ప‌రిస్థితుల్లో ఉన్నవారికి తాము అండ‌గా ఉంటామ‌ని తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు 10 మందికిపైగా ఉన్న‌త విద్య కోసం ఆర్థిక సాయం చేసిన‌ట్లుగా తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version