గుత్తా సుమన్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌..ఫోన్‌ లో ఎమ్మెల్యేల ఫొటోలు !

-

మంచిరేవుల పేకాట కేసులో కీలక నిందితుడు గుత్తా సుమన్ చౌదరి పోలీస్ కస్టడి పూర్తి అయింది. నేడు సుమన్ కుమార్ ను ఉప్పరపల్లి కోర్టు లో హాజరు పరచనున్నారు పోలీసులు. అయితే.. గుత్తా సుమన్ కస్టడీ రిపోర్ట్ లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైద్రాబాద్ లో కెసినో పేకట ఆడిపించలేదని…తాను గోవా , శ్రీలంక , రష్యా , ఫ్రాన్స్ లో కెసినో ఆడిస్తున్నట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు గుత్తా సుమన్.

బయట దేశాలకు వచ్చే వారిని మాత్రమే కేసినో కు తీసుకెళ్లానని…. బర్త్డే పార్టీ కోసం పార్మ్ హౌస్ రెంట్ కి తీసుకున్నానని పోలీసులకు తెలిపాడు. అలాగే గుత్తా సుమన్ ఫోన్ లో ఏపీ , తెలంగాణ కు చెందిన ప్రజా ప్రతినిధుల ఫోటోలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి రోజు 600 మందికి కెసినో మెసేజ్స్ సుమన్ పెట్టేవాడని దర్యాప్తులో తేలింది. ఇక ఇప్పటికే గుత్తా సుమన్ పై 5 గురు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. తమను మోసం చేసారని బాధితులు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. గుత్తా సుమన్ బాధితులు ఎవరు ఉన్నా బయటకు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news