NBK107 Heroine: బాలయ్య సరసన గ‌బ్బ‌ర్ సింగ్ హీరోయిన్!

-

NBK107 Heroine: ఇటు స్వీల‌ర్ స్కీన్ మీద‌.. అటు స్మాల్ స్క్రీన్ మీద‌.. త‌న న‌ట‌న‌, హోస్టింగ్ తో దూసుకున్న‌పోతున్న అగ్ర హీరో నంద‌మూరి బాల‌కృష్ణ. క్రాక్ మూవీ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్నా.. డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని. వీరిద్ద‌రి క్రేజీ కాంబోలో మాస్ ఎంట‌ర్ టైన‌ర్ (#nbk107) రాబోతున్న విష‌యం తెలిసిందే. ఇద్దరూ మంచి ఫామ్ లో ఉండ‌టంతో ఈ సినిమా అనౌన్స్ మెంట్ తోనే భారీ అంచ‌నాలు పెరిగాయి. తాజాగా ఈ క్రేజీ కాంబో మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేడ్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ చిత్రంలో కోలీవుడ్ బ్యూటీ శృతిహాస‌న్‌ను హీరోయిన్ గా ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది.

ఈ బ్యూటీ త‌న‌ అందం, అభిన‌యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తెలుగు, తమిళ్ ఇండస్ట్రీల్లో దూసుక‌పోతుంది. గోపీచంద్‌-శృతిహాస‌న్ కాంబినేష‌న్ లో వచ్చిన చిత్రాలు బాక్సాపీస్‌ను షేక్ చేశాయి. ఈ సెంటిమెంట్ బాల‌కృష్ణ సినిమాకు కూడా ప‌నిచేస్తుంద‌ని ధీమాగా ఉన్నాడీ డైరెక్ట‌ర్. తాజాగా ఈ విష‌యాన్ని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో తెలిపింది. ఇప్పుటికే ఈ బ్యూటీ పాన్ ఇండియాగా తెర‌కెక్క‌బోతున్న స‌లార్ మూవీలో ఓ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోంది. దీంతో మంచి క్రేజ్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో త‌న రెమ్యూన‌రేష‌న్ ను పెంచిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news