వాట్సాప్ అంకుల్స్, యుట్యూబ్ ఆంటీస్..”మంచి రోజులు వచ్చాయి” ట్రైలర్ విడుదల..!

ఇటీవల ఏక్ మినీ కథ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంతోష్ శోభన్ మరో వినోదాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. యంగ్ హీరో ఈ సారి మంచి మంచిరోజులు వచ్చాయి సినిమా తో రాబోతున్నాడు. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరో సంతోష్ కు జోడిగా మెహరీన్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల కాగా ప్రేక్షకులను ఎంతో అలరించింది. కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మై డియర్ వాట్సాప్ అంకుల్స్.. యూట్యూబ్ ఆంటీస్ అంటూ మొదలైన ఈ సినిమా ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ట్రైలర్ ఆద్యంతం వినోదాత్మకంగా ఉంది.

ట్రైలర్ లో మారుతి మార్క్ కామెడీ కనిపిస్తోంది. అంతే కాకుండా ఏక్ మినీ కథ లాంటి కామెడీ ఎంటర్టైనర్ తరవాత సంతోష్ కు ఇది మరో కామెడీ ఎంటర్ టైనర్ గా నిలిచే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక సినిమా లో హీరో హీరోయిన్ లు ప్రేమించుకోవడం ఆ తర్వాత హీరోయిన్ తండ్రి పడే పాట్ల నేపథ్యం లో జరిగే సన్నివేశాలను కామెడీ గా చూపించారు. సినిమా లో వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి లాంటి నటులు ఉండడంతో ఫుల్ లెన్త్ వినోదాత్మక చిత్రంగా సినిమా నిలవబోతుందని అర్థం అవుతోంది. ఇక సినిమా కు అనూప్ రూబెన్స్ ఇచ్చిన స్వరాలు కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా తో హీరో సంతోష్ శోభన్ కు మంచి రోజులు వస్తోయో లేదో చూడాలి.

https://youtu.be/6ZtvPrYLrAE