మరో కొత్త బ్యాంక్ కి RBI గ్రీన్ సిగ్నల్..!

-

దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI తాజాగా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరో కొత్త బ్యాంక్ కి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే…

 

RBI
RBI

దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త బ్యాంకు ని అందుబాటు లోకి తీసుకు రావాలని అనుకుంటోంది. అందుకే కొత్త బ్యాంక్ ని ఏర్పాటు చెయ్యడానికి అనుమతి ఇచ్చింది. అయితే ఈ నిర్ణయం తీసుకోవడం వలన మరింత మందికి బ్యాంకింగ్ సేవలు లభించనున్నాయి. ఇది ఇలా ఉంటే ఆర్‌బీఐ తాజాగా సెంట్రమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, భారత్ పే కన్సార్షియంకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏర్పాటు కోసం ఆమోదం తెలిపింది.

అలానే బ్యాంకింగ్ లైసెన్స్ జారీ చేసింది. దీంతో ఇక కొత్త బ్యాంక్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక ఈ బ్యాంక్ గురించి చూస్తే.. ఈ బ్యాంక్ పేరు యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. తాజా కొత్త బ్యాంక్‌తో కలుపుకుంటే.. భారత్‌లో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల సంఖ్య 12కు చేరిందని చెప్పుకోవచ్చు. దేశీ తొలి డిజిటల్ బ్యాంక్‌గా ఆవిర్భవిస్తామని అన్నారు. అలానే సెంట్రమ్, భారత్‌పే రెండూ కలిసి బ్యాంక్ నిర్వహణ బాధ్యతలు చూసుకోనున్నాయి అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news