“దేవుడు ఉన్నాడు” మృగాడు ఆత్మహత్య పై మంచు మనోజ్ హర్షం !

రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌న సృష్టించిన సైదాబాద్ ఘ‌ట‌నలో మృగాడు రాజు కథ ముగిసింది. ఆ కామాంధుడికి త‌గిన శిక్ష పడింది. పోలీసులు ప‌ట్టుకుంటే.. ఎక్క‌డ చంపుతారన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు మృగాడు రాజు. హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి దారుణంగా హతమార్చాడు రాజు.

manchu

ఈ కేసును చాలా సిరీయ‌స్‌గా తీసుకున్నారు పోలీసులు. నిందితుడి కోసం దాదాపు 1000 మంది పోలీసులు 17 బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. నిందితుడు రాజుకి సంబంధించిన సమాచారమిస్తే రూ.10 లక్షల నగదు రివార్డు ఇవ్వనున్నట్లు హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘట్‌కేసర్-వరంగల్ మధ్య స్టేషన్ ఘన్‌పూర్ మండలం పామునూరు దగ్గర రైల్వే ట్రాక్‌పై అతడి రైల్వే ట్రాక్‌పై అతడి మృతదేహాన్ని గుర్తించారు. చేతిపై మౌనిక అనే టాటూ ఉండ‌టంతో ఆ మృతదేహం రాజుదేనని ధ్రువీకరించారు పోలీసులు.

http://

Thank you for the news sir.. God is there … #OmShantiChaitra #Chaitra https://t.co/hhe0UxFVNd
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 16, 2021

ఈ ఘ‌ట‌న‌పై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి త‌గిన శాస్తి జ‌రిగింద‌నీ, సరిగ్గా వారం రోజులకే ప్రాణాలు విడిచాడనీ .. ఇప్పుడూ ఆ చిన్నారి చైత్ర ఆత్మ శాంతి చేకూరింద‌ని అభిప్రాయ ప‌డ్డారు. ఈ క్రమంలో హీరో మంచు మనోజ్ త‌న‌దైన శైలిలో సోష‌ల్ మీడియా ద్వారా స్పందించారు. ఈ వార్త విన్నందుకు చాలా సంతోషంగా ఉంది.. దేవుడు ఉన్నాడు అంటూ ట్వీట్ చేశారు. మనోజ్ చైత్ర కుటుంబాన్ని పరామర్శించిన విషయం తెలిసిందే.