MBU సిబ్బంది పై మంచు మనోజ్ అనుచరుల ఫిర్యాదు..!

-

చంద్రగిరి పిఎస్ లో MBU సిబ్బంది హేమాద్రి నాయుడు, కిరణ్ పై ఫిర్యాదు చేసారు మంచు మనోజ్ అనుచరులు పళణి, వినాయక. ఈ ఫిర్యాదు అనంతరం మాట్లాడిన మంచు మనోజ్.. మా కుటుంబంలో జరుగుతున్న ఘటనలు బాధాకరం. నాకు దేవుడు ఇచ్చిన వరం అభిమానులు. 8 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న నాపై అభిమానులు ప్రేమ చూపిస్తున్నారు. నాతో సమస్య ఉంటే నాతో మాట్లాడాలి.. నేను ఎక్కడికి పారిపోలేదు.

కానీ నా వాళ్ల వాహనాల్లో చక్కెర పోయడం, కట్టిన బ్యానర్లు తొలగించడం ఏమిటి.. డబ్బులిచ్చి, కిరాయి లకు మనుఘలను పెట్టికుని తిరిగే వాడిని కాదు. పండుగ సమయంలో నా వాళ్లను పిలిపించి మనోజ్ తో ఉండకూడదని బెదిరించారు. క్యాంపస్ సమస్యలు గురించి చర్చించుకుంటే సరిపోతుంది. నలుగురు పెద్ద మనుషులను పిలిచి అన్నదమ్ములతో మాట్లాడితే సరిపోయే చిన్న విషయం. పండుగకు ఇంటికి వస్తే గేట్లు వేశారు. తాత, నాన్నమ్మ సమాధులకు నివాళులు అర్పించేందుకు వెళితే అడ్డుకున్నారు. మా వాళ్లపై దాడి చేయడమే కాకుండా గేట్లు దూకి వెళ్లానని ఫిర్యాదు చేశారు అని మనోజ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news