గట్టిగా ఆరు గ్యారంటీలు‌ అడుగుతే కేసులు పెడుతున్నారు : కౌశిక్ రెడ్డి

-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలని ప్రక్కదారి పట్టించడానికే అరెస్టులు చేస్తున్నారు. గట్టిగా ఆరు గ్యారంటీలు‌ అడుగుతే మాపై కేసులు పెడుతున్నారు అని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలన నడుపుతున్నారు. కేటిఅర్ టెస్లా కంపెనీ హైదరాబాదు తీసుకురావడానికి ఇన్వెస్ట్ చేపియ్యడానికి ఫార్ములా ఈ తీసుకువచ్చాడు. 55 కోట్లు ఆఫీషియల్ గా పంపినామని KTR చెప్పాడు. కాబట్టి కరప్షనే లేనప్పుడు కేసు ఎలా పెడతారు.

తెలంగాణ లో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది. ఆరు గ్యారంటీ లు ఇచ్చేవరకి ప్రశ్నిస్తాం.. కడుగేస్తాం. కరీంనగర్ సమీక్ష సమావేశంలో‌ మంత్రుల అదేశాల మేరకి అందరూ ఎమ్మెల్యేలు నన్ను బెదిరించారు. కరీంనగర్ అర్టివో ఎవరో నాకు తెలియదు..అర్డీఓ నామీద కేసు ఎలా పెడతారు. నా మీద 28 కేసులు పెట్టారు.. ఇవన్నీ ప్రజలకోసం ప్రశ్నిస్తే పెట్టినవే. పీడీ యాక్ట్ పెడతామని అంటున్నారు.. నా మీద పీడీ యాక్ట్ పెట్టే ముందు 89 కేసులున్న రేవంత్ మీద పెట్టాలి. పండగ పూట నన్ను అరెస్ట్ చేయడం మా నేతల్ని, కార్యకర్తల్ని హౌస్ అరెస్ట్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అని పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news