తారకరత్నను చూశా.. త్వరలో వచ్చేస్తాడని ప్రకించారు టాలీవుడ్ హీరో మంచు మనోజ్. నారాయణ హృదయాలయ ఆసుపత్రికి నిన్న రాత్రి చేరుకున్న నటుడు మంచు మనోజ్…మీడియాతో మాట్లాడారు. తారకరత్న చాలా మంచి వ్యక్తి. తారకరత్న ఆరోగ్యం గురించి డాక్టర్లతోనూ మాట్లాడానన్నారు. ఆయన కోలుకుంటాడని వారు నమ్మకాన్ని వెలిబుచ్చారు… ఇదివరకు లాగానే తను మళ్లీ ఆరోగ్యంగా బయటకు రావాలని వెల్లడించారు.
తారక రత్న చిన్నప్పుడు నుంచి నాకు బాగా తెలుసని..ఇటీవల అతని ర్యాలీలు, ప్రసంగాలు చూసా తారకరత్న గట్టి ఫైటర్ అన్నారు. వైద్యం కొనసాగుతోంది. డాక్టర్లు ఇస్తున్న వైద్యంతో పరిస్థితులు మెరుగు పడుతున్నాయని వివరించారు. ఆసుపత్రి లో కోలుకొని బయటికి వస్తారని… మునుపటి లాగే మాతో గడపాలి సభలు, సమావేశాలకు హాజరవుతారని ధీమా వ్యక్తం చేశారు మంచు హీరో. తారకరత్న ఆరోగ్యం కోసం భగవంతుని ప్రార్థించండని కోరారు మంచు మనోజ్. కాగా, తారకరత్న ప్రస్తుతం నారాయణ హృదయాలయ ఆసుపత్రి చికిత్స తీసుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే.