LIC పాలసీదారులకు గుడ్‌ న్యూస్‌..!

-

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ కస్టమర్లకు ఎన్నో రకాల సేవలను ఇస్తోంది. ఈ సేవల వలన చాలా రకాల బెనిఫిట్స్ ని పొందొచ్చు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో రకరకాల ఫీచర్స్‌ను తీసుకు వస్తోంది LIC. వాట్సాప్‌ సేవలను కూడా అందిస్తోంది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. ఆన్ లైన్ పోర్టల్ లో నమోదు చేసుకున్న పాలసీదారుల కోసం ఫస్ట్ టైం వాట్సాప్‌ సేవలను మొదలు పెట్టింది.

పాలసీదారులు ఎల్‌ఐసీ అధికారిక వాట్సాప్‌ చాట్‌బాక్స్ ద్వారా సూపర్ బెనిఫిట్స్ ని పొందవచ్చు. పాలసీలను నమోదు చేసుకున్న పాలసీదారుల కోసం వాట్సాప్‌ సేవలను ప్రారంభించింది. అధికారిక వాట్సాప్‌ చాట్‌బాక్స్ ద్వారా ప్రీమియం వివరాలు, ULIP ప్లాన్, స్టేట్‌మెంట్లతో పాటుగా ఇంకొన్ని లాభాలని మనం పొందొచ్చు.

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లో సేవలను పొందేందుకు ముందే నమోదు చేసుకోవాలి. ఈ విషయాన్ని ఎల్‌ఐసీ ఒక ప్రకటనలో చెప్పింది. www.licindia.in లో కస్టమర్ పోర్టల్‌ కి వెళ్లి పాలసీని నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ సేవలని ఎలా పొందచ్చనేది చూసేద్దా.

దీని కోసం మీరు మొదట వాట్సాప్‌ నంబర్‌ 8976862090ను సేవ్‌ చెయ్యండి.
తరవాత మీరు వాట్సాప్‌ని ఓపెన్‌ చేసి ఆ తరవాత ఆపై ఎల్‌ఐసి వాట్సాప్ చాట్ బాక్స్‌లో సెర్చ్ చేసి ఓపెన్‌ చేసేయండి.
తరవాత మీరు చాట్ బాక్స్‌లో ‘హాయ్’ అని పంపండి.
ఇప్పుడు మీకు 11 ఆప్షన్స్‌ వస్తాయి.
చాట్‌లో ప్రత్యుత్తరం ఇవ్వండి అప్పుడు మీరు సేవలని పొందొచ్చు.
ఇలా మీరు ఎల్‌ఐసీ వాట్సాప్ చాట్‌ లో అవసరమైన సేవలని పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news