సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో చాలా ట్రోల్లింగ్ వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా మంచు విష్ణు మంచు లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యుల అందరి పైన కొందరు అదే పనిగా ట్రోల్స్ చేస్తు.. మిమ్స్ చేస్తూ ఉన్నారు. ఇక ఇటీవల కాలంలో మంచు విష్ణు మాట్లాడుతూ తనమీద తమ కుటుంబం మీద ఒక వ్యక్తి కావాలని ఇలా ప్రచారం చేస్తున్నారని ఆరోపించడం జరిగింది. అందుకోసం భారీ మొత్తంలో కూడా ఖర్చు చేసి మరి ఇలా తమ కుటుంబాన్ని విమర్శిస్తున్నారని మంచు విష్ణు తెలియజేయడం జరిగింది.
అయితే అందుకు సంబంధించి పూర్తి వివరాలు మాత్రం తెలియజేయలేదు. అయితే తమ కుటుంబాన్ని తనని ట్రోల్స్ చేస్తున్న వారు ఎవరో చెప్పాలి అని చాలామంది అభిమానులు సైతం అడుగుతున్నారట.అయితే తాజాగా వారు ఎవరో చెప్పలేదు కానీ కొన్ని లింక్స్ మాత్రం ఇవ్వడం జరిగింది. దీంతో తన సినిమాకు విడుదలకు ముందే ఇలాంటి నెగటివ్ టాక్ ను స్ప్రెడ్ చేసే వారి గురించి మంచు విష్ణు తెలియజేయడం జరిగింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తో తన ట్విట్టర్ నుంచి ఒక లింక్ ని క్లిక్ చేయడం జరిగింది మంచు విష్ణు వీరి వల్ల సినిమాలు నాశనం అవుతున్నాయి అన్నట్లుగా తను ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
సినిమా ఎలా ఉన్నా కూడా వీళ్ళు సోషల్ మీడియా ద్వారా నెగటివ్ టాక్ ను మాత్రమే స్ప్రెడ్ చేస్తారని.. అందుకోసం వీరందరూ భారీగానే ప్రయత్నాలు చేస్తూ ఉంటారని మంచు విష్ణు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇలా తన సినిమా విడుదలవుతోంది అంటే చాలు కొందరు సిద్ధంగా ఉండి బ్యాడ్ గా ప్రచారం చేస్తున్నారని మంచు ఫ్యామిలీ అభిమానులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి మంచు విష్ణు ఈ విషయం బయట పెట్టడంతో ఈ విషయం సద్దుమనుతుందేమో చూడాలి.
As expected. I am calling out the ‘paid batch’. GINNA hasn’t released and these guys have started giving negative reviews. Why so much hatred???? 🙄. I hope they realize that we will shut their channels down soon. pic.twitter.com/6FJ1xV4vaj
— Vishnu Manchu (@iVishnuManchu) October 20, 2022