మామిడి రైతు వాట్స్ అప్ గ్రూప్.. ఆర్డర్ చేయండిక..

-

లాక్ డౌన్ కారణంగా రైతులు ఏ స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారో అందరికి తెలిసిందే. వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోలేక రైతులు ఇప్పుడు పంటలను నాశనం చేసే పరిస్థితి ఉంది. ఏడాది అంతా కష్టపడి ఇప్పుడు పంట సీజన్ వచ్చే సమయానికి ఈ విధంగా కరోనా రూపంలో ఆపద రావడంతో రైతులకు ఏం చెయ్యాలో అర్ధం కావడం లేదు. ముఖ్యంగా మామిడి, బత్తాయి, నిమ్మ రైతులు బాగా ఇబ్బందులు పడుతున్నారు.

తాజాగా మామిడి పంటను అమ్ముకోవడానికి గాను కొందరు రైతులు కాస్త వినూత్నంగా ఆలోచించడం మొదలుపెట్టారు. సాంకేతికతను వాడుకోవడానికి సిద్దమయ్యారు. తమ సమస్యకు తామే పరిష్కారం చూపించుకోవాలి అని నిర్ణయం తీసుకున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన రమణ రాంబాబు అనే యువ రైతు మ్యాంగో ఫార్మర్స్ సపోర్టర్స్ అనే ఒక వాట్సాప్ గ్రూప్ ని క్రియేట్ చేసారు.

ఇందులో హైదరాబాద్ సహా పలు ప్రాంతాలకు చెందిన వ్యక్తులను సభ్యులుగా జాయిన్ చేసారు. వారి నుంచి ఆర్డర్లను తీసుకుని వారానికి రెండు సార్లు వినియోగదారులకు అందిస్తున్నారు. వీరి దగ్గర ఎక్కువగా బంగినపల్లి, పెద్ద రసాలు ఎక్కువగా అందుబాటులో ఉంటున్నాయి. కేజీ 40 ఊపాయలకు అమ్ముతున్నారు. ఆర్డర్ కావాలి అంటే కచ్చితంగా 15 కేజీలు ఆర్డర్ చెయ్యాలి. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు 5 నుంచి 7 పికప్ పాయింట్స్ లో అందిస్తున్నారు. మీకు కూడా కావాలి అంటే 8185815986 నెంబర్ ని సంప్రదించండి. రైతులకు మీ వంతు సహకారం అందించండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version