30నిమిషాల్లో తయారయ్యే మామిడి వెరైటీలు.. మీకోసమే..

-

మార్కెట్లోని మామిడి పండ్లు మీ నోరూరిస్తుంటే అచ్చమైన వేసవిలో ఉన్నట్టే లెక్క. పక్క్న సూప్పర్ మార్కెట్లోని మామిడి పండ్లో, రోడ్డు మీద తోపుడు బండి మీద ఉన్న పండ్లో మీ నోటిలో లాలాజలాన్ని ఊరించేస్తాయి. అప్పుడిక ఆలస్యం చేయకుండా మీకిష్టమైన పండ్లరాజు మామిడిని తినేయండి. అయితే చాలామంది మామిడి పండ్లతో వెరైటీలు చేస్తారు. మీకిష్టమైన మామిడి పండుతో చేసే వెరైటీలు చాలా అద్భుతంగా ఉంటాయి. కేవలం 30నిమిషాల్లో తయారయ్యే ఈ మామిడి వెరైటీలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

మామిడి సేమియా

భోజనం చేసిన తర్వాత డెజర్ట్ తినే అలవాటున్న వారికి బాగా నచ్చే వెరైటీ ఇది. వెర్మిసెల్లి తీసుకుని నెయ్యి, పాలల్లో వేయించాలి. దానిలో ఎండుద్రాక్ష, ఇతర డై ఫ్రూట్స్ వేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత మామిడి పండ్లని తీసుకుని తోలు తీసివేసి ముక్కలుగా కోసి, ఆ ముక్కలని అందులో వేసుకోవాలి. మామిడితో చేసిన సేమియా చల్లగా ఉంటే రుచిగా ఉంటుంది కాబట్టి, రిఫ్రిజిరేటర్లో ఉంచుకున్న తర్వాతే ఆరగించండి.

మామిడి అన్నం

మామిడి పులుపు దనం అన్నానికి మరింత రుచిని అందిస్తుంది. వేసవి పూర్తయ్యేలోగా ఒక్కసారైనా మామిడికాయతో చేసిన అన్నం తినాల్సిందే. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. ఒక పాత్రలో నువ్వులనూనె తీసుకుని పొయ్యి మీద పెట్టి అందులో ఆవాలు వేయండి. ఆవాలు చిటపటలాడుతుంటే శనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు కలపండి.
తురిమిన మామిడిని తీసుకుని పక్కన పెట్టండి. అన్నం వండాక పక్కన పెట్టండి. చల్లారిన తర్వాత అందులో తురిమిన మామిడిని కలపండి. బాగా మిక్స్ చేస్తే మామిడి అన్నం తయారైనట్టే.

Read more RELATED
Recommended to you

Exit mobile version