పరువు నష్టం కేసులో స్టార్మీకి చుక్కెదురు.. ట్రంప్‌నకు రూ.కోటి చెల్లించాలని కోర్టు ఆదేశం

-

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై వేసిన పరువునష్టం కేసులో మాత్రం పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు మరోసారి చుక్కెదురయ్యింది. కాలిఫోర్నియాలోని 9వ యూఎస్‌ సర్క్యూట్‌ కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌.. డేనియల్స్‌ వాదనను తోసిపుచ్చింది. దీంతో కోర్టు ఫీజులో భాగంగా ట్రంప్‌ తరఫు న్యాయవాదులకు లక్షా 20వేల డాలర్లు (సుమారు రూ.కోటి) చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. మన్‌హటన్‌ న్యాయస్థానంలో ట్రంప్‌ హాజరైన రోజే మరో కోర్టులో ఆయనకు అనుకూలంగా ఈ తీర్పు రావడం గమనార్హం.

అయితే ట్రంప్‌ అరెస్టుకు, ఈ సివిల్‌ కేసుకు సంబంధం లేనప్పటికీ రెండు కూడా స్టార్మీ డేనియల్స్‌కు సంబంధించినవే. అయితే, గతంలో ట్రంప్‌పై ఆమె చేసిన ఆరోపణలపై స్పందిస్తూ.. కేవలం డబ్బు కోసమే ఇలాంటి బెదిరింపు ఆరోపణలు చేస్తుందని ట్రంప్ దుయ్యబట్టారు. ట్రంప్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై డేనియల్స్‌ 2018లో కోర్టును ఆశ్రయించారు. ఈ పరువునష్టం కేసులో స్టార్మీ డేనియల్స్‌  ఓడిపోవడంతోపాటు లీగల్‌ ఫీజు కింద ఆమె 2.93లక్షల డాలర్లు చెల్లించాలని స్థానిక కోర్టు ఆదేశించింది.

అనంతరం పై కోర్టులో అప్పీలు చేసుకోగా.. అక్కడ కూడా మరో 2.45లక్షలు ఫైన్‌ పడింది. తాజా అప్పీలులోనూ స్టార్మీ డేనియల్స్‌కు చుక్కెదురయ్యింది. దీంతో మొత్తంగా ఆమె దాదాపు 6లక్షల డాలర్లకుపైగా ట్రంప్‌ తరఫు అటార్నీలకు చెల్లించాల్సి ఉంటుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version