మోదీ వ్యాఖ్యలపై తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు

-

నిజామాబాద్ సభా వేదికగా ప్రధాని మోదీ బీఆర్ఎస్ సర్కార్‌పై ఘాటైన విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజల నుంచి దోచుకున్న సొమ్మును బీఆర్ఎస్ కర్ణాటక ఎన్నికల్లో అందించిందని సంచలన ఆరోపణలు చేశారు. అలాగే ‘మీకో రహస్యాన్ని చెప్పబోతున్నా.. చెప్పమంటారా..? ఇప్పటి వరకు దాన్ని ఎప్పుడు చెప్పలేదు.. ఇప్పుడు చెప్పుతున్నా’.. అంటూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు బీజేపీ గెలిచింది. అన్ని సీట్లు మేము గెలుస్తారని వారు ఊహించలేదు.

అప్పుడు కేసీఆర్‎కు సపోర్ట్ కావాల్సి వచ్చింది. ఆ సమయంలో నేను ఎయిర్ పోర్ట్‎కు వస్తే పెద్ద పెద్ద కెమెరాలు పట్టుకుని, గజ మాలలు తీసుకుని స్వాగతం పలికేందుకు వచ్చేవారు. కానీ ఇప్పుడు ఎందుకు రావడం లేదో తెలుసా..? అంటూ ఇన్నారు ప్రధాని. కేసీఆర్.. నన్ను కలిసేందుకు ఢిల్లీకి వచ్చారు.. పెద్ద పెద్ద శాలువాలు తెచ్చారు.. అప్పుడు ఎంతో బాగా ఆదరించారు, ఎంతో ప్రేమ చూపించారు. అయితే ఇది కేసీఆర్ క్యారెక్టర్ కాదని నేను అప్పుడే అనుకున్నాని పేర్కొన్నారు.

అయితే ఈ నేపధ్యం లో, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణికం ఠాగూర్ ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించారు. కేసీఆర్ ఎన్డీయేలో చేరాలనుకున్న సంగతి మోదీ వ్యాఖ్యలతో బట్టబయలైందని తెలిపారు. కేసీఆర్ ఎన్డీయేలో చేరాలనుకున్నది నిజమని తేలిందని పేర్కొన్నారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్ కోరుకున్నది నిజం అని మాణికం ఠాగూర్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి రెండేళ్లుగా ఇదే విషయం చెబుతున్నారని వెల్లడించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version