అమిత్ షా కు ఆ దమ్ముందా? : మానిక్కం ఠాగూర్

-

జిహెచ్ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టో కీలకం టీపీసీసీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని బీజేపీ చెడగొడుతుందని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకుల భాష సక్రమంగా లేదు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఇక టిఆర్ఎస్ అవినీతి పై కాంగ్రెస్ పోరాటం చేస్తోందన్న ఆయన వరద సహాయాన్ని టిఆర్ఎస్ నాయకులు నొక్కేశారని అన్నారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి పై ఆరోపణలు చేసిన కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఎందుకు కేంద్ర సంస్థలతో విచారణ చేయించలేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు హైదరాబాద్ వచ్చి టిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు సీబీఐ విచారణ జరిపించడం లేదు. ? అమిత్ షా కు టిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి పై కేసు పెట్టి విచారణ జరిపే దమ్ముందా? అని ప్రశ్నించారు. గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ చేస్తున్నారని ఆయన అన్నారు. బండి సంజయ్ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఎందుకు బండి సంజయ్ మీద కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుస్తామని ఆయన అన్నారు. 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version