ఎంపీ కోమటిరెడ్డి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు : ఠాక్రే

-

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే అన్నారు. ఆయన పార్టీ లైన్‌లోనే ఉన్నారని తెలిపారు. రాహుల్‌గాంధీ మాటలకు కోమటిరెడ్డి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు.

కాంగ్రెస్‌ నాయకులంతా ఐక్యంగా ఉన్నారని, త్వరలోనే పాదయాత్ర చేస్తారని వెల్లడించారు. ఠాక్రే బుధవారం గాంధీభవన్‌లో టీపీసీసీ ఉపాధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి 34 మంది ఉపాధ్యక్షులు హాజరు కావాల్సి ఉండగా.. కేవలం 9మంది మాత్రమే హాజరయ్యారు. పీసీసీ ఉపాధ్యక్షుల గైర్హాజరుపై ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు గైర్హాజరయ్యారో వివరణ అడగాలని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డికి సూచించారు.

మరోవైపు పనితీరు బాగాలేని వారిపై ఠాక్రే ఫైర్ అయ్యారు. పనితీరు బాగాలేకుంటే పార్లమెంట్‌ ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న వారిని మార్చాల్సి ఉంటుందని హెచ్చరించారు. కొందరు ఉపాధ్యక్షులు కోమటిరెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ఇంకోసారి మాట్లాడదామని సర్ది చెప్పారు. ఎల్లుండి మరోసారి ఉపాధ్యక్షులతో సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version