బెంగాల్ కు చెందిన రైట్ హ్యాండ్ క్రికెటర్ మనోజ్ తివారీ ఈ రోజు ఎంతో ఎమోషన్ నోట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. 2008 లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టిన మనోజ్ తివారీ 2015 వరకు మాత్రమే ఆడగలిగాడు. ఆ తర్వాత ఫామ్ లో లేకపోవడంతో కేవలం దేశవాళీ టోర్నీలకు పరిమితం అయ్యాడు. తన ఇంటర్నేషనల్ కెరీర్ లో 12 వన్ డే లు మరియు మూడు టీ 20 మ్యాచ్ లను ఆడాడు. అంతే కాకుండా 2012 లో జరిగిన టీ 20 వరల్డ్ కప్ లో ఇండియా టీం లో ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్ లోనూ ఆడే అవకాశం రాలేదు. ఇక ఐపీఎల్ లో అయితే కోల్కతా నైట్ రైడర్స్ తరపున బరిలోకి దిగి 2012 లో మొదటిసారి టైటిల్ ను గెలుచుకోవడంలో ఫైనల్ మ్యాచ్ లో విలువైన పరుగులు చేశాడు. ప్రస్తుతం రాజకీయంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మంత్రిగా ఉంటూ యువకులకు సేవలను అందిస్తున్నాడు. ఉన్న మనోజ్ తివారీ అదే సమయంలో మొన్నటి వరకు రంజీ మ్యాచ్ లను ఆడుతూ వచ్చాడు.
ఇక మరపురాని విషయం ఏమిటంటే మనోజ్ తివారీ మొదటి మ్యాచ్ ను 2003 లో ఈడెన్ గార్డెన్స్ లో ఆడాడాడు, అదే విధంగా తన చివరి మ్యాచ్ ను 2023 లో ఈడెన్ గార్డెన్స్ లోనే ఆడాడు.