ఫ్యాక్ట్ చెక్ : ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ రూ. 15,490 అంటూ మెసేజ్ వచ్చిందా..? నిజం ఏమిటి..?

-

నకిలీ వార్తల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో తరచు మనకి నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి. ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం చాలా మంది నకిలీ వార్తలని నిజమని భావించి, అనవసరంగా మోస పోతున్నారు. నకిలీ వార్తల వలన చాలా మంది అకౌంట్ ఖాళీ అయిపోతుంది కూడా.

ఫ్యాక్ట్ చెక్
ఫ్యాక్ట్ చెక్

సోషల్ మీడియాలో ఒక మెసేజ్ వైరల్ అవుతోంది. అది నిజమా కాదా అందులో నిజం ఎంత అనే విషయానికి ఇప్పుడు వచ్చేద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని అందరూ ఫైల్ చేస్తున్నారు. అయితే ఇన్కమ్ టాక్స్ రిఫండ్ అంటూ ఫోన్ల కి ఒక మెసేజ్ వస్తోంది.

ఇన్కమ్ టాక్స్ రిఫండ్ కింద రూ.15,490 పొందడానికి మీరు అర్హులని మెసేజ్ వస్తోంది. అయితే ఇది నిజమా కాదా..? ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఈ మెసేజ్ లని పంపిస్తోందా లేదా అనే విషయానికి వచ్చేస్తే.. ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది. ఇందులో నిజం లేదు. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించింది. ఇది వట్టి నకిలీ వార్త అని చెప్పేసింది కనుక అనవసరంగా ఇలాంటి వార్తలని నమ్మి మోసపోవద్దు.

Read more RELATED
Recommended to you

Latest news