డ్రింకర్ సాయి మూవీ డైరెక్టర్‌పై మంతెన సత్యానారాయణ ఫ్యాన్స్ దాడి

-

ఇటీవలి కాలంలో సినిమా ఆర్టిస్టులు,దర్శకులు, నిర్మాతలపై దాడులు పెరిగిపోతున్నాయి. ప్రతి చిన్న అంశాన్ని కొందరు సీన్ చేస్తున్నారు. మీ సినిమా ద్వారా తమ మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొంటూ వారిపై భౌతికదాడులకు పాల్పడుతున్నారు. గతంలో కొందరు కోర్టు ద్వారా ఇలాంటి సమస్యలకు పరిష్కారం కోసం వెతికితే ఈ మధ్యకాలంలో దాడులు పెరిగిపోతున్నాయి.

తాజాగా డ్రింకర్ సాయి మూవీ డైరెక్టర్ కిరణ్ తిరుమల శెట్టిపై దాడి జరిగింది. మంతెన సత్యనారాయణ అభిమానులు దర్శకుడిపై దాడి చేసినట్లు సమాచారం.డ్రింకర్ సాయి సినిమాలో మంతెన సత్యనారాయణను కించపరుస్తూ కొన్ని సీన్లు తీశారని ఆయన ఫ్యాన్స్ విచక్షణా రహితంగా దాడి చేసినట్లు తెలిసింది.సినిమా సక్సెస్ టూర్‌లో భాగంగా గుంటూరు శివ థియేటర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దర్శకుడు ప్రెస్‌మీట్ నిర్వహిస్తుండానే లైవ్‌లో దాడి జరగగా ఆ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news